బిగ్ బాస్2: షోని వెంటనే ఆపేయమంటున్నారు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 24, Aug 2018, 2:31 PM IST
bigg boss2: case filed against bigg boss show
Highlights

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వారు బిగ్ బాస్ షోని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో మసాలా కొంచెం ఎక్కువైంది. 

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వారు బిగ్ బాస్ షోని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో మసాలా కొంచెం ఎక్కువైంది. ఈ షోకి ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కిందో అదే రేంజ్ లో విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ ఈ షోని వెంటనే ఆపేయాలంటూ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు.

బిగ్ బాస్ ప్రోగ్రాం పేరుతో 16 మందిని ఒకేఇంట్లో బంధించి సొసైటీకి ఏమాత్రం పనికిరాని విషయాలను ప్రసారం చేస్తున్నారంటూ ఆయన అంటున్నారు. ఈ షోతో కొందరి మనోభావాలు దెబ్బ తింటున్నాయని, కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉంటోందని లాయర్ భాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తోన్న ఈ షోని వెంటనే నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు.

మరి ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమీషన్ అలానే ఈ షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. గతంలో కూడా ఇలానే కొన్ని టీవీ షోలపై నిషేధం విధించాలని కొందరు కంప్లయింట్లు చేశారు. 

 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader