బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. ప్రతివారం ఈ షో లో సినిమాలను ప్రమోట్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఈరోజు 'నీవెవరో' టీమ్ ఈ షోకి వచ్చింది. హీరో ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ లు ఈ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ రేడియో అంటూ ఈ ముగ్గురు హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

సినిమా టీమ్ హౌస్ లో ఉన్న సభ్యులకు కొన్ని టాస్క్ లను ఇచ్చారు. అవి చాలా ఎంటర్టైనింగ్ సాగుతాయనిపిస్తుంది. గీతామాధురిని పిలిచి బిగ్ బాస్ కి మంచి ప్రవర్తన నేర్పమని అడగగా, బిగ్ బాస్ గా కౌశల్ నటించాడు. కౌశల్ ని పట్టుకొని గీతా కొంచెం కరగచ్చుగా బిగ్ బాస్ అని అడగగా.. బిగ్ బాస్ కరగడు అని సమాధానమిచ్చాడు కౌశల్.

'బిగ్ బాస్ ఎప్పుడూ ప్రేమలో పడలేదని' కౌశల్ బిగ్ బాస్ వాయిస్ లో బిగ్గరగా చెప్పగా 'మేం పడేస్తాంగా' అని గీతా చెప్పిన డైలాగ్ ప్రోమోకి హైలైట్ గా నిలిచింది. ఇక రెండు రోజులుగా బిగ్ బాస్ లో పెళ్లి తతంగంతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఈరోజు ఎపిసోడ్ కాస్త రిలీఫ్ ఇస్తుందనే అనిపిస్తోంది.