బిగ్ బాస్2: కెప్టెన్సీ టాస్క్ లో గొడవ.. పూజాపై కౌశల్ అసహనం!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 24, Aug 2018, 2:57 PM IST
bigg boss2: kaushal fires on pooja during captaincy task
Highlights

బిగ్ బాస్ సీజన్ 75 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ వారం పూర్తి కావొస్తుండడంతో హౌస్ లో కెప్టెన్సీ టాపిక్ మొదలైంది. ఈ వారం కెప్టెన్ అవ్వడానికి కౌశల్, దీప్తి లు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు

బిగ్ బాస్ సీజన్ 75 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ వారం పూర్తి కావొస్తుండడంతో హౌస్ లో కెప్టెన్సీ టాపిక్ మొదలైంది. ఈ వారం కెప్టెన్ అవ్వడానికి కౌశల్, దీప్తి లు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. వారు మాత్రమే కాకుండా యాంకర్ శ్యామల, అమిత్ లు కూడా కెప్టెన్సీ టాస్క్ లో పోటీ  చేయాలనుకుంటున్నారు. బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఎలాంటి టాస్క్ ఇవ్వబోతున్నారా అని ఎదురుచూస్తున్నారు కంటెస్టెంట్లు.

అయితే తాజాగా ఈ టాస్క్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. గతంలో ఓసారి కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన టెంట్ లోకి వెళ్లమని ఎవరు ముందుగా వెళ్తారో వారు నామినేషన్స్ ను తప్పించుకోవచ్చని అన్నారు. ఈసారి కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ మేట్స్ అందరిలో ఎవరు ముందుగా వెళ్లి కన్ఫెషన్ రూమ్ లో ఉన్న కుర్చీపై కూర్చుంటారో వారు ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ పడొచ్చని సూచించారు.

దీంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లడంతో తోపులాట జరిగింది. ముందుగా దీప్తి, కౌశల్, సామ్రాట్ వెళ్లి కుర్చీలో కూర్చోగా వారిపై పూజా రామచంద్రన్ కూర్చొని తనే ముందుగా వచ్చానని వాదనపెట్టుకుంది. కౌశల్.. దీప్తికి సపోర్ట్ చేస్తూ తనే ముందుగా కూర్చుందని పూజాతో చెబుతున్నా ఆమె మాత్రం దానికి అంగీకరించడంలేదు. మరి ఈరోజు కెప్టెన్సీ ఎపిసోడ్ ఎలా సాగుతుందో చూడాలి!

 


ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: షోని వెంటనే ఆపేయమంటున్నారు!

బిగ్ బాస్2: గీతకు సామ్రాట్ ముద్దు.. సోషల్ మీడియాలో వైరల్!

బిగ్ బాస్2: మేం పడేస్తాంగా ప్రేమలో.. గీతామాధురి కామెంట్స్!

loader