బిగ్ బాస్ సీజన్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. షో ముగింపు దశకు చేరుకునేకొద్దీ దీనిపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు హౌస్ లో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుండడం చూశాం. షో ఎండింగ్ కి చేరుకోవడంతో ఈ వారం నుండి ఇద్దరు చొప్పున హౌస్ మేట్స్ బయటకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

ఇందులో నాని ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటూ ఒక్క సెకన్ షాక్ ఇచ్చి ఆ తరువాత డబుల్ ఎలిమినేషన్ అంటూ వెల్లడించారు. ఈవారం హౌస్ నుండి ఇద్దరు బయటకి వెళ్లబోతున్నారంటూ స్పష్టం చేశారు. అయితే ఎవరు వెళ్లిపోబోతున్నారనే విషయంలో గణేష్, అమిత్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతివారంలానే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో ఆడియన్స్ లో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.

కచ్చితంగా గణేష్, అమిత్ లు ఈ వారం హౌస్ ని విడిచిపెట్టి వెళ్లిపోతారనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. అయితే సీజన్ 1లో చేసినట్లుగా శనివారం ఎపిసోడ్ లో ఒకరిని, ఆదివారం ఎపిసోడ్ లో మరొకరిని హౌస్ నుండి బయటకి పంపబోతున్నారని సమాచారం. 

ఇవి కూడా చదవండి.. 

'కౌశల్ ఆర్మీ'ని వాడుకుందామని కామెంట్స్ చేసిన గీతాపై నెటిజన్లు ట్రోలింగ్!

బిగ్ బాస్2: ఈ డ్రామాలేంటి..? బిగ్ బాస్ పై తనీష్ ఫైర్!

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!

బిగ్ బాస్2..ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్