బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా భారీగా ఫేమ్ సంపాదించారు సోహెల్. హౌస్ లో సోహెల్ మేనరిజం, యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనితో అతనికి భారీగా ఓట్లు దక్కాయి. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా ఫైనల్ కి వెళ్లిన సోహెల్, మూడవ స్థానం అందుకున్నాడు. అయితే నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకొని సోహెల్ టైటిల్ రేసు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. 

సింగరేణి ముద్దు బిడ్డ అంటూ తనకో బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న సోహెల్, ఆ ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్నాడు . సోహెల్ ఫైనల్ కి చేరడంలో తన సొంత ఊరు కరీంనగర్ ప్రేక్షకుల మద్దతు ఎంతగానో ఉంది. కాగా సింగరేణి నేపథ్యంలో ఓ మూవీ ఖచ్చితంగా చేస్తానని అంటున్నాడు సోహెల్. తన సొంత ఊరు కరీంనగర్, సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో భవిష్యత్తులో మూవీ చేస్తాను అన్నారు. 

సోహెల్ తండ్రి సింగరేణి బొగ్గుగనిలో కార్మికుడు, మధ్యతరగతి కుటుంబం నేపథ్యం వీరిది. ఇక టైటిల్ విన్నర్ అభిజీత్, రన్నర్ అఖిల్ కంటే ముందు సోహెల్ మూవీ ప్రకటించడం విశేషం. జార్జిరెడ్డి నిర్మాత సోహెల్ తో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక సోహెల్ మూవీలో క్యామియో రోల్ చేయడానికి రెడీ అని బిగ్ బాస్ వేదికసాక్షిగా చిరంజీవి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.