కంటెస్టంట్లు, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టంట్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే షోలో గ్రూపులుగా ఉన్న స్నేహితులు గొడవల కారణంగా విడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకువస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. 

షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టంట్లలో నుండి ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటివరకు హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూరెడ్డి, అలీ రెజా, శిల్ప చక్రవర్తి, హిమజలు ఎలిమినేట్‌ అయ్యారు. అయితే రీఎంట్రీ ఛాన్స్ మాత్రం అలీకే ఎక్కువగా ఉంది. 

నేటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్.ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఓ వ్యక్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్నాడు. అతడు డాన్స్ చేసిన తీరు, బాడీ లాంగ్వేజ్ ని బట్టి అలీనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని జనాలు ఫిక్స్ అయిపోయారు.

నిజానికి అలీ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎలిమినేషన్‌ జోన్‌లోకి వెళ్లిన మొదటి సారే అలీ ఎలిమినేట్‌ అవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. దీంతో అతడి అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అలీ లేకుండా షో చూడడం వేస్ట్ అంటూ బిగ్ బాస్ షోపై కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అలీ ఎంట్రీతో అతడి అభిమానులకు పండగే.