బిగ్ బాస్ సీజన్ 1 సమయంలో ఆ షో సమయానికి అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. మొదట్లో ఆ షోని విమర్శించినా.. మెల్లగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు సీజన్ 2 మొదలైంది. కంటెస్టంట్ల ఎంపికలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ రెండు రోజులు తరువాత షోపై ఆడియన్స్ లో ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతోంది. బాబు గోగినేని, సంజన, తేజస్వి వంటి పోటీదారులు రాణిస్తున్నారు.

ఒక్కోసారి హౌస్ లో కెమెరాలు ఉంటాయనే సంగతి మర్చిపోయి వ్యక్తిగత విషయాలను కూడా చర్చించుకుంటూ ఉంటారు. తాజాగా తేజస్వి కూడా అలానే తన పెర్సనల్ విషయాలను పంచుకుంది. అయితే ఆ సమయంలో నిర్వాహకులు బీప్ సౌండ్ వేసేయడంతో ఆడియన్స్ కు వినడం కుదరలేదు. ఇంతకీ తేజస్వి ఏం మాట్లాడిందంటే.. సినిమాలలో అవకాశాలు రెమ్యునరేషన్ వంటి విషయాలను ప్రస్తావిస్తూ.

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత డబ్బు కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో రోజుకి రూ.12 వేలు మాత్రమే వచ్చేవి.. ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కాలంటే పూర్తి స్థాయిలో ప్రయత్నించాలని జాబ్ వదిలేశాను. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నందుకు ఇంత ఇస్తున్నారు'' అంటూ ఆమె తన రెమ్యునరేషన్ ను చెప్పింది. అయితే ఆ మాటలకు ఎడిటింగ్ లో బీప్ సౌండ్ వేసేశారు.