అశ్వినిదత్ ను 25కోట్లు ముంచిన ఎన్టీఆర్

ashwinidutt lost 25 crores with ntr shakthi
Highlights

  • తిరిగి సినిమా నిర్మాణం ప్రారంభించిన అశ్వినిదత్
  • శక్తి సినిమా తో  25 కోట్ల భారీ నష్టం చవిచూసిన వైజయంతీ మూవీస్
  • చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా నిర్మాణం చేపట్టిన అశ్వినీదత్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో తీసిన శక్తి సినిమా వల్ల మొత్తం 25 కోట్లు నష్టపోయానని తన జీవితంలో అంత సొమ్ము ఎప్పుడూ పోగొట్టుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు అగ్ర నిర్మాత అశ్వనీదత్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించాడు . 2011 లో రిలీజ్ అయిన శక్తి ఘోర పరాజయం పొందింది . దాంతో 25 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది శక్తి సినిమా దాంతో సినిమా అంటేనే భయపడిపోయారు . సిల్వర్ జూబ్లీ , గోల్డెన్ జూబ్లీ లను అందించిన వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది.

 

అయితే దానికి ఎవరినీ నిందించడం లేదని , అందరం ఆడుతుందనే నమ్మకంతో సినిమా చేశామని కానీ ఫలితం మాత్రం దారుణంగా వచ్చిందని తెలిపాడు అశ్వనీదత్ . గతకొంత కాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న ఈ అగ్ర నిర్మాత మళ్ళీ సినిమా నిర్మాణాలకు పూనుకుంటున్నాడు . ఈ ఏడాది మహేష్ బాబు తో నిర్మించనున్న చిత్రానికి దిల్ రాజు తో కలిసి జాయింట్ వెంచర్ లో భాగస్వామి అవుతున్నాడు . ఇప్పుడు నా టైం వచ్చిందని ఇకపై సినిమా నిర్మాణం కొనసాగుతుందని అంటున్నాడు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader