అరవింద సమేత: పైరసి ఎటాక్ మొదలైంది.. ఆ సీన్ లీక్!

First Published 11, Oct 2018, 12:53 PM IST
aravindha sametha sceen leaked
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రోజు రానేవచ్చింది. అరవింద సమేత కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం మొదటి షో ముగియగానే సంబరాలు మొదలయ్యాయి. 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రోజు రానేవచ్చింది. అరవింద సమేత కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్టోబర్ 11వ తేదీ ఉదయం మొదటి షో ముగియగానే సంబరాలు మొదలయ్యాయి. సినిమాకు మంచి రెస్పాన్స్ అందడంతో అందరి ద్రుష్టి  కలెక్షన్స్ పై పడింది. 

అయితే ఎంత పెద్ద సినిమా అయినా పైరసి భూతం నుంచి తప్పించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. అదే విధంగా అరవింద సమేత చిత్ర యూనిట్ ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పైరసి భూతం స్వైర విహారం చేస్తున్నట్లు తెలుస్తోంది.  సినిమాలో ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రడక్షన్  సీన్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

దీంతో నందమూరి అభిమానులు వీలైనంతవరకు ఆ సీన్ ను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం 28 సెకన్ల నిడివి కలిగిన ఆ సిన్ ను ముబైల్ లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే స్పెషల్ టీమ్ తో రపైరసి అరికట్టేందుకు రెడీగా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎవరో ఒకరు లీక్ చేస్తుండడం వారికి తలనొప్పిగా మారింది. మరి ఈ పైరసి భూతాన్ని వారు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి. 

 

సంబంధిత వార్తలు

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

loader