Asianet News TeluguAsianet News Telugu

అరవింద బుక్ మై షోని కూడా వదల్లేదు!

విడుదలైన మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ లో చేరినట్లు అరవింద సమేత చిత్ర యూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూఎస్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి తారక్ కెరీర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది.

aravindha sametha new record in book my show
Author
Hyderabad, First Published Oct 16, 2018, 5:22 PM IST

విడుదలైన మొదటి వారంలోనే 100కోట్ల క్లబ్ లో చేరినట్లు అరవింద సమేత చిత్ర యూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూఎస్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి తారక్ కెరీర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. 

కర్ణాటక లో కూడా సినిమాను భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఆ సంగతి అటుంచితే సినిమా టికెట్స్ అమ్ముడుపోవడంలో కూడా ఒక రికార్డ్ నమోదైంది.  2018లో ఆన్లైన్ లో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా అరవింద సమేత నిలిచింది. ఆన్లైన్ మూవీస్ టికెట్స్ దిగ్గజం బుక్ మై షోలో అయితే 1.2 మిళియన్స్ టికెట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక బాహుబలి తరువాత ఆ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న తెలుగు చిత్రంగా అరవింద సమేత నిలిచింది. 

ఫైనల్ గా తారక్ కెరీర్ లోనే ఇది బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమా అరవింద సమేత. దసరా హాలిడేస్ ఉండటంతో ముందు రోజుల్లో కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. తారక్ నటనతో పాటు జగపతి బాబు యాక్టింగ్ సినిమాకు మెయిన్ గా ప్లస్ అయ్యాయి. 

 

సంబంధిత వార్తలు..

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

Follow Us:
Download App:
  • android
  • ios