పుల్వామా ఉగ్రవాది దాడిని భారతీయులు జీర్ణించుకోలేకపొతున్నారు. నలభై మందికి పైగా జవానులు ఈ దాడిలో మరణించడం ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. ఈ పనికి కారకులైన వారిని శిక్షించాలంటూ దేశం మొత్తం ముక్తకంఠంతో కోరుకుంటోంది.

అయితే ఈ దేశంలోనే ఉంటూ పాకిస్తాన్ ని పొగుడుతోన్న కొందరు వ్యక్తులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నటి రష్మి కూడా అటువంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ 'ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు' అంటూ  చేసిన కామెంట్ పై స్పందించిన రష్మి.. 'దేశ విభజన సమయంలోనే పాక్ వైపు వెళ్లాల్సింది.

కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరో నెటిజన్ 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ చేసిన కామెంట్ కి రష్మి కోపం మరింత పెరిగిపోయింది. ''నీ పాకిస్తాన్ గొప్పతనం ఏంట్రా..? సాలే.. మాతోనే మీకు అస్తిత్వం.. మూసుకొని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య'' అంటూ అతడిని బూతులు తిట్టేసింది.