పాపులారిటీని బట్టి ధర

First Published 16, Jun 2018, 2:20 PM IST
anchor anasuya and srireddy reacts on chicago sex racket
Highlights


అమెరికాలో సెక్స్ రాకెట్ పై అనసూయ, శ్రీరెడ్డి

అమెరికాలో  సెక్స్ రాకెట్ గట్టు బట్టబయలు కాగా.. అందులో టాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకులు ఇద్దరు భార్య భర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్‌ మోదుగుముడి అలియాస్‌ రాజు అలియాస్‌ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 

అయితే ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్‌ జూన్‌ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి, యాంకర్‌ కమ్‌ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. 

ఈ విషయంపై యాంకర్ అనసూయ మాట్లాడుతూ.. ‘ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్‌లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపారు.

ఇక వివాదాస్పద యాంకర్ శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్‌ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ ఆఫర్‌ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు.

loader