బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సౌత్ చిత్రాలలో నటించింది. అమీజాక్సన్ మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది. అమీజాక్సన్ నటించింది కొన్ని చిత్రాల్లోనే అయినా తన గ్లామర్ తో యువతని ఫిదా చేసింది. కానీ అమీ జాక్సన్ కు సరైన సక్సెస్ పడలేదు. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించక పోవడంతో అమీ జాక్సన్ కు అవకాశాలు తగ్గాయి. 

దిగ్గజ దర్శకుడు శంకర్ రెండు చిత్రాల్లో అమీ జాక్సన్ కు అవకాశం ఇచ్చారంటే ఆమె ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా అమీ జాక్సన్ ప్రస్తుతం తన ప్రియుడు జార్జ్ తో లండన్ లో సెటిల్ అయిపోయింది. గత కొంతకాలంగా అమీ జాక్సన్ అతడితో ప్రేమలో ఉంటూ సహజీవనం చేస్తోంది. 

అవధుల్లేని సంతోషంతో రాంచరణ్ సతీమణి.. కారణం ఇదే!

వివాహం కాకుండానే గర్భం దాల్చింది. అమీ జాక్సన్ గర్భవతి అయ్యాక వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇదిలా ఉండగా అమీ జాక్సన్ కొన్ని రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కొడుక్కి అమీ జాక్సన్ 'ఆండ్రియాస్' అని నామకరణం చేసింది. 

తాజాగా అమీ జాక్సన్ తన కొడుకు ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ముద్దొచ్చేలా ఉన్న అమీ జాక్సన్ కొడుకుని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమీ జాక్సన్ చేసిన ఈ పోస్ట్ కు ఇప్పటికే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Light of my life ❤️

A post shared by Amy Jackson (@iamamyjackson) on Nov 21, 2019 at 7:26am PST

పలువురు సెలెబ్రిటీలు కూడా అమీ జాక్సన్ కొడుకు ముద్దొచ్చేలా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అమీ జాక్సన్ తన కొడుకుని ఉద్దేశిస్తూ.. నా జీవితానికి ఓ వెలుగు' అని కామెంట్ పెట్టింది.