లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా ఇళ్ళల్లోనే ఉన్నారు. చేయటానికి ఏ పనీ లేదు. చక్కగా ఫ్యామిలీలతో గడుపుతున్నారు. అయితే తమ ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని సిట్యువేషన్. దేశంలో కరోనా రోజు రోజుకీ రెచ్చిపోతోంది. మే 15 నాటికి దేశంలో లక్షల్లో కేసులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో షూటింగ్ లు ఇప్పడిప్పుడే మొదలు కావని అర్దమవుతోంది. ఆ కేసులు తగ్గాలి,జనం బయిటకు వచ్చి థియోటర్స్ కు వెళ్లటం మొదలెట్టాలి...అప్పుడు కానీ షూటింగ్ లు మొదలు పెట్టలేని సిట్యువేషన్. ఈ నేపధ్యంలో ఆల్రెడీ మొన్న సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్, మహేష్ ల పరిస్దితే కాస్త ఇబ్బందిగా ఉందిట. 

ఎందుకంటే ఓ పెద్ద హిట్ కొట్టాక..ఇమ్మీడియట్ గా సినిమా మొదలై ,షూట్ కు వెళ్తే ఆ క్రేజే వేరు. జనం ఆ సినిమా కోసం ఎదురుచూస్తూంటారు. బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ఉంటుంది. మార్కెట్ కూడా రెట్టింపుకు వెళ్తుంది. అల్లు అర్జున్ ..అలవైకుంఠపురములో హిట్ కొట్టాడు. మహేష్ బాబు సైతం సరిలేరు నీకెవ్వరూ అంటూ హిట్ కొట్టారు. ఈ సినిమాలతో సూపర్ హై వచ్చింది. మహేష్ అయితే ఇంకా ఏ సినిమా ఫైనలైజ్ చేసి, పట్టాలు ఎక్కించలేదు కాబట్టి ఏ సమస్యా లేదు. కానీ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంగా పుష్పని మొదలెట్టాడు. అల వైకుంఠపురములో సక్సెస్ ఖచ్చితంగా ఈ సినిమా బిజినెస్ పై పడుతుందని అంచనా వేసారు. అందుకు తగ్గట్లుగా బడ్జెట్ ని భారీగా పెట్టుకున్నారు. కానీ పరిస్దితులు తిరగబడుతున్నాయి. 

ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుందో బన్ని,సుకుమార్ ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం పెంచిన జుట్టు, బాడీ సైతం మెయింటైన్ చేయటం కూడా కష్టమే.  దాంతో బన్ని కాస్తంత నిరాశగానే ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే బన్ని ఇప్పటిదాకా లాక్ డౌన్ టైమ్ లో మీడియా ముందుకు వచ్చింది లేదు. తన పర్శనల్ వీడియోలు వదలటం లేదు. అయితే ఇలా లేటైన ప్రతీసారి బన్నీ సూపర్ హిట్ కొడుతున్నాడు. గతంలో గ్యాప్ వచ్చినప్పుడే అల వైకుంఠపురములో వంటి మెగా హిట్ పడింది.