Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది. బాలీవుడ్ లో వచ్చిన 'సోను కే టీటు కి స్వీటీ' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా చేయాలని బన్నీ.. త్రివిక్రమ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

Allu Arjun and Vijay Deverakonda Combo?
Author
Hyderabad, First Published Nov 13, 2018, 4:35 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది. బాలీవుడ్ లో వచ్చిన 'సోను కే టీటు కి స్వీటీ' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా చేయాలని బన్నీ.. త్రివిక్రమ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

దీంతో రీమేక్ చేయడం ఇష్టం లేనప్పటికీ త్రివిక్రమ్.. బన్నీ కోసం చేయడానికి సిద్ధపడుతున్నాడు. తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయబోతున్నాడు. ఒరిజినల్ హిందీ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరు హీరోలు, ఓ అమ్మాయి మధ్య జరిగే కథే ఈ సినిమా. సినిమాలో ఇద్దరు హీరోలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది.

దీంతో అల్లు అర్జున్ కాకుండా ఈ కథకి మరో హీరో కావాల్సివుంది. ఇండస్ట్రీ వర్గాల ప్రచారాన్ని బట్టి నిర్మాత అల్లు అర్జున్ హీరో విజయ్ దేవరకొండని రెండో హీరోగా అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించమని అడిగినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే మల్టీస్టారర్ గా ఈ సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చు.

బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగే ఛాన్స్ ఉంటుంది. విజయ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెకండ్ హీరోగా నటిస్తే తన కెరీర్ పై ప్రభావం పడుతుందని ఆలోచిస్తున్నాడట. మరి అల్లు అర్జున్ తన స్కిల్స్ తో విజయ్ ని ఒప్పించగలడో లేదో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బన్నికు భలే సమస్య వచ్చిందే..ఇంకో హీరో అర్జెంట్ గా వాంటింగ్

దీపావళి రోజు బన్నీ స్పెషల్ ట్వీట్!

బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?

త్రివిక్రమ్ తో బన్నీ పక్కా.. ప్రాజెక్ట్ వివరాలు!

త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!

  

Follow Us:
Download App:
  • android
  • ios