ఇప్పుడు సెలబ్రెటీలు అంతా ఫిట్‌నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు. ఎవ‌రికి తోచిన రీతిలో వారు ఎక్స‌ర్‌సైజుల‌ను చేస్తూ తమ శరీరాన్ని అందంగా ఉంచుకుంటున్నారు. వాళ్లు అప్పుడప్పుడూ పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు చూస్తే... ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. రెగ్యులర్ పిట్ నెస్ ఫ్రీక్స్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కరీనాకపూర్ .. బిపాసా బసు.. శిల్పా శెట్టి వంటి భామలు వెరైటీలెన్నిటినో అనుసరిస్తుంటారు.  తాజాగా ఆ లిస్ట్ లో జాక్విలిన్ చేరింది. 

యోగాతో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటానంటూ తెలిపే ఓ వీడియోని ఇనస్ట్రాలో షేర్ చేసింది. ఆ వీడియోని చూస్తే మనకు ఆమె యోగా ప్రాక్టీస్ పై కన్నా ఆమె అందాలపై దృష్టి పడుతుందనటంలో సందేహం లేదు. మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్దమవుతుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stretch 💖 keep that spine healthy and happy! Yoga poses are my fav, anytime, anywhere!

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on Mar 15, 2020 at 9:56pm PDT


ఇక జాక్విలిన్ రెగ్యులర్ గా యోగా చేస్తుంది. ఫిట్ నెస్ కోసం ఆమె పవర్ యోగా బాటపట్టారు. తన అందాలను కాపాడుకోవడం కోసం  ఈ బాలివుడ్ భామ  అనేక ఫిట్ నెస్ ట్రెయినింగులు తీసుకున్నప్పటికీ, యోగా మాత్రమే అటు మానసిక, శారీరక ఉల్లాసానికి ఉపయోగపడుతుందని  చెప్తోంది.

ఇక బాలీవుడ్ లో ..కరీనా- శిల్పా శెట్టి యోగాలో ఎక్స్ పర్ట్స్. బిపాసా జుంబా స్టైల్ ని ఇష్టపడుతుంది. దీపిక- దిశా పటానీ- ఈవ్ లీన్ శర్మ కాస్తంత కఠోరమైన సాదన (జిమ్- యోగా) చేస్తుంటారు. వీళ్లకు తోడు జాక్విలిన్ ఫెర్నాండెజ్… సోనమ్ కపూర్.. ఆలియా భట్.. జాన్వీ.. సారా అలీఖాన్ లాంటి భామలు రకరకాల జిమ్మింగ్ స్టైల్స్ ని అనుసరిస్తూ రెగ్యులర్ గా హాట్ టాపిక్ అవుతున్నారు. 

మలైకా అరోరా ఖాన్ అయితే ఏకంగా తన ప్యాక్డ్ యాబ్స్ ని చూస్తూ రెగ్యులర్ గా మురిసిపోతుందని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. ఇక మలైకా తన సిస్టర్ అమృత అరోరాతో కలిసి రకరకాల వెరైటీ ఫిట్ నెస్ స్టైల్స్ అనుసరిస్తుంది. కలిసే యోగా చేసేందుకు ఇష్టపడుతుంది.  ఐశ్వర్యారాయ్ సైతం ఫిట్ నెస్ ఫ్రీక్ గా పేరు తెచ్చుకున్నారు. తల్లి అయిన ఇంకా టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేస్తూంటారు ఐష్.. కరీనా ..మలైకా ..శిల్పా . ఇక సౌత్ లోనూ రకుల్ ప్రీత్ .. శ్రీయ సహా పలువురు జిమ్ యోగా వంటి వాటిలో నిష్ణాతులు.