బాలీవుడ్ లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.  ఇప్పటికే పలువురు నటీనటులు, టెక్నీషియన్లు కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడింది. తాజాగా మరో బాలీవుడ్ నటి రాచెల్ వైట్ కు కూడా మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

ట్విట్టర్ ద్వారా రాచెల్ స్పందిస్తూ, తనకు కరోనా సోకిందని చెప్పింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని తెలిపింది. ఈ వైరస్ నుంచి తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని అభిమానులను కోరింది. రాచెల్ ట్వీట్ చూసిన అభిమానులు ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని చెపుతున్నారు. 

జ్వరం దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా టెస్ట్ చేయించుకుంది. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటి కోల్ కతాలోని తన నివాసంలో హోం క్వారంటైన్ లో ఉంటోంది. తన ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరటంతో...నెటిజన్లు ఆమెకు మద్దతుగా దైర్యం చెబుతున్నారు.