ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంలో రహస్యమైన తిరుగుబాటుదారుడు ఉన్నట్లు కనిపిస్తుంది. గొంతు పాడు కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ బాలుకు తన గొంతుపై స్పష్టమైన అవగాహన ఉన్నట్లే కనిపిస్తుంది. గీతాంజలికి డబ్బింగ్ చెప్పే సమయంలో బాలుకు గొంత సమస్య వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్తే చిన్న బొడిపె ఉన్నట్లు తెలిసింది. దాన్ని సర్జరీ చేసి తీసేయాలని వైద్యుడు చెప్పారట. మెడికేషన్ వల్ల కరిగిపోతుందని కూడా చెప్పారట.

Also Read:బాలు అత్యధికంగా జాతీయ అవార్డ్స్ ఎన్నిసార్లు అందుకున్నారంటే..!

సర్జరీ చేయించుకుంటే పాటలు పాడడం కష్టమవుతుందని అనుకుంటారు. కానీ బాలు దాన్ని లెక్కచేయలేదు. ఈ విషయం లతా మంగేష్కర్ కు తెలిసింది. ఆమె బాలుకు ఫోన్ చేసి సర్జరీ చేయించుకోవద్దని చెప్పారట. మనకు గొంతు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడని, దాంట్లో మెటల్ పడకూడదని ఆమె చెప్పారట. అయితే, ఎస్బీ బాలు ఆమె మాటకు సరేనంటూనే సర్జరీ చేయించుకున్నారు.

Also Read:ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

వారం రోజుల పాటు పాటలు పాడడం మానేయాలని, ఇంకా కాస్తా ఎక్కువ రోజులు డబ్బింగ్ చెప్పడం మానేయాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారట. అయితే, నువ్వు పాడకపోతే ఎలా అని సోదరుడు విశ్వం అనడంతో నాలుగు రోజులకే పాట పాడారు. 

Also Read:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఆ మిత్రుడే

తనకు డబ్బింగ్ చెప్పకపోతే ఎలా అని కమల్ హాసన్ అన్నారట. కమల్ హాసన్ కు, బాలుకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కమల్ హాసన్ ను బాలు తమ్ముడు అంటారు. కమల్ హాసన్ అలా అనడంతో వెంటనే డబ్బింగుకు కూడా చెప్పారట. బాలుకు భయాలు, ఆందోళనలు ఉన్నట్లు లేవు. అందుకే ఆ తెగువ ప్రదర్శించారు. ఆ తర్వాత ఆయన గొంతు వినిపిస్తూనే వచ్చింది.

Also Read:

ఎస్బీ బాలు మొండి ఘటమే: సూపర్ స్టార్ కృష్ణతో వివాదం

బాలు గాత్రం నుంచి జాలువారిన ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్

సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరేమిటో తెలుసా.....

ఎస్పీ బాలుది రుక్మిణీ కల్యాణం: ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు

బాలసుబ్రహ్మణ్యం స్మోక్ చేసేవారు: కూతురి ఒక్క మాటతో...

గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!