బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ యాంకర్స్ లో ఒకరు. రష్మీకి సామజిక స్పృహ ఎక్కువే. అదే విధంగా రష్మీ జంతు ప్రేమికురాలు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న మూగజంతువులకు రష్మీ స్వయంగా ఫుడ్ అందించింది. 

తాజాగా రష్మీ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మీ జీవితంలో బ్రేకప్స్ ఏమైనా ఉన్నాయా.. ఉంటే ఆ బాధని ఎలా భరించారు అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఈ విషయం గురించి ఇంతకుముందే చెప్పా.. అది నా పర్సనల్ లైఫ్ అని రష్మీ తెలిపింది. 

క్రేజీ బ్యూటీకి రాహుల్ లిప్ లాక్ కిస్.. వీడియో వైరల్, రెచ్చగొడుతున్న అషు రెడ్డి

మరో నెటిజన్ సుధీర్ తో రిలేషన్ గురించి ప్రశ్నించాడు. సుధీర్ తో పెళ్లి చేసుకునే బంధం ఉందా లేక ప్రోగ్రామ్స్ కోసం టైం పాస్ చేస్తున్నారా అని ప్రశ్నించాడు. దీనికి రష్మీ బదులిస్తూ గాసిప్స్ గురించి మాట్లాడడం నీకు టైం పాస్.. నాకు కాదు.. కాబట్టి నీ పని నువ్వు చూసుకో అని బదులిచ్చింది. 

ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ తనకు వెబ్ సిరీస్ లలో నటించే ఆలోచన ఉందని, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడినట్లు రష్మీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో కూడా నటిస్తానని కాకపోతే విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్నట్లు రష్మీ చెప్పుకొచ్చింది.