Asianet News TeluguAsianet News Telugu

"డ్రైవింగ్ లైసెన్స్" తీసుకున్న రామ్ చరణ్

ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు.

RAM CHARAN has acquired the rights of Driving License
Author
Hyderabad, First Published Feb 17, 2020, 8:40 AM IST

ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు. మరో యంగ్ హీరో ఎన్టీఆర్ తో ఈ ప్రాజెక్టు చేస్తూండటంతో ఈ సినిమాపై ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్న రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టారు. తాజాగా మళయాళంలో ఘన విజయం సాధించిన " డ్రైవింగ్ లైసెన్స్" చిత్రం రైట్స్ తీసుకున్నారు.

ఈ చిత్రం ఫన్,యాక్షన్ తో నడుస్తుంది. అనీల్ రావిపూడి చేత ఈ చిత్రం రీమేక్ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసుకున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత ...ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని,మళయాళీ చిత్రం బాగా నచ్చేసే తీసుకున్నట్లు రామ్ చరణ్ చెప్తున్నారట.

డిసెంబర్ 2019న రిలీజైన ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో చేసారు. జూ.లాల్ డైరక్ట్ చేసిన ఈ సినిమా మళయాళి పరిశ్రమలో డీసెంట్ హిట్ గా నమోదైంది. ఈ మధ్యనే లూసీఫర్ సినిమా రైట్స్ తీసుకున్న రామ్ చరణ్ మళ్లీ మరో మళయాళీ చిత్రం రైట్స్ తీసుకోవటంపై అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మళయాళి సినిమాలంటే రామ్ చరణ్ కు బాగా నచ్చుతున్నాయని, ముఖ్యంగా పృధ్వీరాజ్ సుకుమారన్ తో ఉన్న పరిచయం తో ఈ సినిమాలు తీసుకోవటం జరిగిందని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios