Asianet News TeluguAsianet News Telugu

అది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యం : పవన్ కల్యాణ్

తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి దివంగత ఎన్టీఆర్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Pawan Kalyan comments on Nandamuri Taraka Rama Rao
Author
Hyderabad, First Published Feb 17, 2020, 9:39 AM IST

సినీ,రాజకీయ రంగాల్లో అప్పటికీ ఇప్పటికీ ఎన్టీఆర్‌ ఓ సంచలనం. ఆయన స్థాపించిన పార్టీ విజయం మరో సంచలనం. పార్టీ ఏర్పాటు చేసిన కొద్ది నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకుని తనదైన శైలితో పాలన రథాన్ని నడిపించిన అనితర సాధ్యుడు ఎన్‌.టి.రామారావు. నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని పదిలం చేసుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రం ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా గుర్తు చేసుకున్నారు.

తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి దివంగత ఎన్టీఆర్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం జనసేన నేతలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఈ విషయం ప్రస్దావించారు.

పవన్ కోసం చిరంజీవి డైలాగ్.. మరోసారి నితిన్ అభిమానం.. భీష్మ స్టోరీ రివీల్!

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టగానే ఆయనలా అధికారంలోకి రావడం అందరికీ సాధ్యం కాదని, ఆ నాటి పరిస్థితుల కారణంగా ఒక్క ఎన్టీఆర్‌కే అలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజం స్వార్థం దారి పట్టిందని, ఉచితంగా అన్నీ అందిస్తాం అనే మాటలతో రాజకీయ నాయకులు యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జనసేన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి‌చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.

తాను చాలా దూర దృష్టితో జనసేన పార్టీ స్థాపించానని, రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందలేదని, తమ పార్టీపై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు తమకు ఓట్లేశారని తెలిపారు.  

Pawan Kalyan comments on Nandamuri Taraka Rama Rao

Follow Us:
Download App:
  • android
  • ios