యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం ఇదే. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారు. 

ఈ శుక్రవారం భీష్మ చిత్రం విడుదల కానుండటంతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. నితిన్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో నితిన్ భీష్మ చిత్ర కథ గురించి వివరించాడు. అలాగే తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ రీఎంట్రీపైన కూడా నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత పింక్ రీమేక్ తో వస్తున్నారు. ఎలా ఉండబోతోంది అని ప్రశ్నించగా నితిన్ ఇంద్ర చిత్రంలోని ఓ డైలాగ్ చెప్పాడు. కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడు అనే డైలాగ్ ఉంటుంది. ఆయన మళ్ళీ సినిమాల్లోకి తిరిగొచ్చినా అవే రికార్డులు, థియేటర్స్ లో అవే విజిల్స్ అంటూ పవన్ రీఎంట్రీకి నితిన్ ఇంద్ర డైలాగ్ ని అన్వయించాడు. 

ఇక భీష్మ చిత్రపై ప్రేక్షకులు ఎలాంటి అంచనాలతో రావాలి.. ఈ కథ ఎలా ఉండబోతోంది అనే సంగతులని కూడా నితిన్ తెలిపాడు. ప్రేక్షకులు దాదాపు రెండున్నర గంటలపాటు కామెడీ, మధ్య మధ్యలో వచ్చే ఫైట్స్, సాంగ్స్ తో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇందులో భారీ స్థాయిలో కథ ఉండదు. మీమ్స్ చేసే కుర్రాడు ప్రేమలో పడడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఒక్క అమ్మాయి కూడా సెట్ కాదు.అలాంటి సమయంలో రష్మిక పరిచయం అవుతుంది. ఆమె ద్వారా ఆర్గానిక్ ఫామింగ్ అనే మరో కథలోకి హీరో ఎంటర్ అవుతాడు. అక్కడ చిన్న సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాం అని నితిన్ భీష్మ కథని రివీల్ చేశాడు. 

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భీష్మ చిత్రాన్ని నిర్మిస్తోంది. నితిన్ తదుపరి చిత్రం రంగ్ దే కూడా ఇదే బ్యానర్ లో ఉండబోతోంది. సోమవారం సాయంత్రం ఏఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్. అలాగే సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. 

గ్లామర్ షోలో రెచ్చిపోతున్న శ్రద్దా.. నడుము అందాలతో సెగలు