బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సైనా'. ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు అమోల్ గుప్తా డైరెక్టర్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే షూటింగ్ జరుగుతోన్న సమయంలో హీరోయిన్ పరిణీతి గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'సైనా' షూటింగ్ సమయంలో తనకు గాయాలు కాకుండా చిత్రబృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందని అయినప్పటికీ తనకు గాయం తగిలిందని.. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తరువాత బాడ్మింటన్ ఆడడానికి మళ్లీ సిద్ధపడతానని చెప్పుకొచ్చింది.

ఈ వారం ట్రేడ్‌ టాక్‌: బూతు కథకి వసూళ్లు, బట్టతలేమో హిట్టు!

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో ఆమె మెడకి బ్యాండేజ్ కనిపిస్తోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
పరిణీతి తన కెరీర్ లో 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌', 'దావత్‌-ఏ-ఇష్క్‌', 'నమస్తే ఇంగ్లండ్‌' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు సైనా బయోపిక్ తో ఆడియన్స్ ని మెప్పించడానికి సిద్ధమవుతోంది. నిజానికి మొదట ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ని ఎంపిక చేసుకున్నారు. శ్రద్ధా ఫోటోతో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆమె కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆ ఛాన్స్ పరిణీతికి వచ్చింది.