ఈ వారం ట్రేడ్ టాక్: బూతు కథకి వసూళ్లు, బట్టతలేమో హిట్టు!
ఈ సినిమాతో పాటు కుర్ర హీరో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాక బయ్యర్లు లబోదిబోమంటున్నారు.
గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడడం లేదు. డిసంబర్ నుండి పెద్ద సినిమా తాకిడి ఉండడంతో చిన్న సినిమాలన్నీ ముందుకు జరుగుతూ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలకు సేల్స్ బాగుంటాయని 'ఏడు చేపల కథ' మరోసారి నిరూపించింది. కేవలం బూతు కంటెంట్ తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఆ తర్వాత ఆ స్థాయిలో నిలబడలేకపోయినప్పటికీ నిలకడగా వసూళ్లను మాత్రం సాధిస్తోంది.
మూడు గుడ్లుకు రూ.1672 బిల్లు.. షాకైన మ్యూజిక్ డైరెక్టర్!
ఈ సినిమాతో పాటు కుర్ర హీరో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాక బయ్యర్లు లబోదిబోమంటున్నారు.
ఇక బాలీవుడ్ యంగ్ హీరో హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'బాలా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో వంద కోట్ల సినిమా వేసుకున్నాడు ఆయుష్మాన్. బట్టతల ఉన్న వ్యక్తి.. అతడి ప్రేమ, పెళ్లి వంటి విషయాలతో ఈ సినిమా సాగుతుంది.
కథ ఎంపిక విషయంలో వైవిధ్యం కనబరుస్తూ నటనలో తన సత్తా చాటుతూ హిట్ల మీద హిట్లు అందుకుంటున్నాడు ఆయుష్మాన్. ఇక ఈ వారం సందీప్ కిషన్ నటించిన ' 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' , అలానే విశాల్ నటించిన 'యాక్షన్' అనే డబ్బింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.