టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. టాలెంట్ ఉన్నప్పటికి ఇంతవరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. కెరీర్ లో మనోజ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. అతని కెరీర్ లో బెస్ట్ హిట్ బిందాస్ - పోటుగాడు మాత్రమే. మధ్యలో కొన్ని సినిమాలతో హడావుడి చేసినప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ అందుకోలేకపోయారు.

తండ్రి మోహన్ బాబు కూడా ఎక్కువగా మనోజ్ కెరీర్ పై ఫోకస్ పెట్టలేదు. ఇక ఫైనల్ గా ఆయన నిర్మాతగా చిన్న కుమారుడికి బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్టివ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే సినిమాని స్టార్ట్ చేశాడు. ఇక మోహన్ బాబు కూడా 60కోట్ల భారీ బడ్జెట్ తో కొడుక్కి కాస్ట్లీ సినిమాని రెడీ చేయనున్నారట. ఈ విషయంపై గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ కి ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మోహన్ బాబు విలేకరులతో మాట్లాడారు. త్వరలో మంచు మనోజ్ తో 60కోట్ల బడ్జెట్ తో సినిమాని రూపొందించనున్నట్లు చెప్పారు. అయితే దర్శకుడు ఎవరు? కాన్సెప్ట్ ఏమిటనే విషయాలని చెప్పలేదు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మరీ ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.