దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి మహేష్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ కానుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ లో చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన దర్శకుడు వంశీ నెక్స్ట్ చిత్ర యూనిట్ ని కూడా వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మహర్షి సినిమాతో మంచిసక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ టీమ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మహేష్ మైండ్ చేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  మహర్షి సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ అనుకున్నంతగా మెప్పిచలేకపోయాడు.

ఇక 'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే అదరణపొందాయి. అంచనాలకు తగ్గటుగా దేవి ఇటీవల కంపోజ్ చేయలేకపోతున్నాడు. దీంతో మహేష్ ఈ సారి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ ని ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం తెలుగులో కూడా అనిరుద్ అదిరిపోయే సాంగ్స్ అందిస్తున్నాడు. దీంతో అతనిపై మహేష్ కన్ను పడినట్లు టాక్. ఏ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్నిర్ రోజులు వెయిట్ చేయాల్సిందే.