సాధారణంగా దక్షణాది చిత్రాల వివాదాలు ఏదో ఒక సామజిక వర్గం మనోభావాలు దెబ్బ తినడం వల్లే మొదలవుతాయి. గతంలో అనేక చిత్రాలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం చూశాం. తాజాగా తమిళ క్రేజీ హీరో ధనుష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ నటించిన అసురన్ చిత్రం తమిళనాట ఘనవిజయం అందుకుంది. 

ప్రస్తుతం ధనుష్.. కర్ణన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మారిసెల్వరాజ్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ వర్గాన్ని తప్పుగా చూపించే సన్నివేశాలు ఉండబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో కర్ణన్ చిత్రానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. 

1999లో కోడియాంగుళం మణిమచ్చి జాతి మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనితో తమని ఈ చిత్రంలో తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పులిప్పడై వర్గం వారు నిరసనలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. వెంటనే కర్ణన్ చిత్ర షూటింగ్ కు అనుమతి నిరాకరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నితిన్ ‘భీష్మ’ రివ్యూ

తమ మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రం ఉంటే ఎలాంటి దాడులకైనా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఓ యువకుడు అయితే తమని కించపరిచేలా సినిమా చేస్తే తల నరుకుతా అంటూ వీడియో పొస్త్ చేశాడు. మొత్తంగా కర్ణన్ చిత్రం తమిళనాట దుమారం రేపుతోంది. 

హీరో ధనుష్ ఎక్కువగా మాస్ ప్రేక్షకులకు చేరువయ్యే రస్టిక్ కథలనే ఎంచుకుంటున్నాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తున్న ధనుష్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.