న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం `రూల‌ర్‌`. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `రూల‌ర్‌`. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వీటికి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో కొత్త లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. ప‌ర్టికుల‌ర్‌గా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. ఈ ఫోటో చూస్తుంటే బాలయ్య కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. 

బట్టతలతో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన యువ హీరో

`రూల‌ర్‌` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి.

`జైసింహా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.