సీనియర్ యాంకర్ ఉదయభానుకి ఒకప్పుడు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. 'వన్స్ మోర్ ప్లీజ్', 'సాహసం చేయరా డింభకా', 'డాన్స్ బేబీ డాన్స్' వంటి షోలతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఉదయభాను.

కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. 'లీడర్' సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే 2004లో విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు తన కెరీర్ ని కొనసాగించింది. ఆ తరువాత ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనివ్వడంతో టీవీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.

విజయ్ దేవరకొండ హీరోయిన్.. క్లీవేజ్ అందాలు!

చాలా గ్యాప్ తరువాత ఇటీవల మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. సినిమా ఈవెంట్స్ కూడా చేస్తోంది. వరుస టీవీ షోలతో బాగానే సంపాదిస్తోంది ఈ బ్యూటీ. దీంతో తాజాగా ఓ లగ్జరీ బెంజ్ కారుని కొనుగోలు చేసింది. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కారు డెలివెరీ తీసుకుంది.

ఈ సమయంలో తీసిన ఫోటోలు బయటకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తారలు ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల యాంకర్ మంజూష, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ లాంటి తారలు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు.