టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓవర్సీస్ లో కూడా బన్నీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది. అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఆ సినిమా రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది.  ఇటీవల 'అల..వైకుంఠపురములో' ప్రమోషన్స్ కారణంగా కొంత గ్యాప్ ఇచ్చిన బన్నీ నెక్స్ట్ ఎలాంటి గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమాని పూర్తి చేయనున్నాడు.సినిమాలో చాలా వరకు దర్శకుడు కొత్త నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర సింపుల్ గా కనిపిస్తూనే స్పెషల్ థ్రిల్ ని కలిస్తుందట.

మిగతా నటీనటులు చాలా వరకు కొత్త నటీనటులే కనిపిస్తారని సమాచారం. ఎందుకంటె కథలో ఒక కొత్త తరహా ప్రాంతాన్ని చూపించాలని అనుకుంటున్న సుకుమార్ అందులో కొత్తవారు ఉంటేనే ఫ్రెష్ ఫీల్ వస్తుందని డిసైడ్ అయ్యారట. ఇకపోతే విలన్ రోల్ కోసం విజయ్ రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి - బన్నీ ల మధ్య భారీ ఫైట్స్ ఉంటాయట. దాదాపు 10కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరోవైపు కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ 'మాస్టర్' లో కూడా ఈ విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు.