పాపులర్ హిందీ సీరియల్స్  ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘నచ్ బలియే’ వంటి సీరియల్స్‌లో నటించిన ఓ నటి తనను వినీత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ రేప్ చేశాడంటూ మీడియా ముందుకు వచ్చింది. అక్టోబర్ 13న హర్యానా రాష్ట్రం యమునానగర్ లో ఉన్న ఓ హోటల్ కి రమ్మని వినీత్ తనను పిలిచినట్లు నటి తెలిపింది.

అతడితో మంచి పరిచయం ఉండడంతో వినీత్ చెప్పిన హోటల్ కి వెళ్లిందట సదరు నటి. ఆ సమయంలో అతడు ఇచ్చిన జ్యూస్ లో డ్రగ్స్ కలిపాడని.. ఆ తరువాత తనను లొంగదీసుకున్నాడని చెప్పుకొచ్చింది. గర్భం దాల్చే వరకు వినీత్ తనను రేప్ చేశాడన్న విషయం తనకు తెలియదని వెల్లడించింది.

ప్చ్... ఎంత బ్యాంగ్రౌౌండ్ ఉన్నా.. కలిసిరాలే!

దీంతో వినీత్ ని పెళ్లి చేసుకోమని అడిగిందట. కానీ అతడు దానికి ఒప్పుకోలేదని.. గర్భం దాల్చినందుకు తనను పెళ్లి చేసుకోనని ముఖం చాటేశాడట. చేసేదేం లేక బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. వినీత్ తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కూడా ఫిర్యాదు చేసింది.

వినీత్ గురించి అతడి ఇంట్లో వారికి చెబితే.. వాళ్లు వినీత్ నే సపోర్ట్ చేశారని బాధితురాలు కంప్లైంట్ లో పేర్కొంది. ప్రస్తుతం వినీత్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ముంబైలో సీరియల్స్ లో పని చేసినప్పుడే వినీత్ తో ఈ నటి పరిచయమట. అతడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తోంది.