విశాఖపట్నం:  గోపాలపట్నం లో పట్టపగలే నడిరోడ్డు పై దొంగల భీభత్సం సృష్టించారు. కారు లో కూర్చున్న ఓ మహిళ మెడలో ఉన్న సుమారు 11  తులాలు బంగారం తెంచుకొని దొంగలు పరారయ్యారు. విశాఖ గాజువాకకు చెందిన పెదగంట్యాడకు చెందిన గానుగుల వరలక్ష్మి తన భర్తతో కలిసి బంధువులు ఇంట్లో శుభకార్యానికి కారులో వెళ్లారు.

వీడియో

"

 అయితే మోకాళ్ల నొప్పుల కారణంగా భార్యని కారులో వదిలి భర్త బంధువుల ఇంట్లోకి వెళ్ళారు. ఇదే అదునుగా భావించిన చైన్ స్పాచర్స ఒంటరిగా  కారులో వున్న మహిళ మెడలో నుంచి బంగారం తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దగ్గర్లో ఉన్న షాపులోని సిసి కెమేరా పుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.