టీమిండియా క్రికెట్ జట్టులో ఆటగాళ్ల మధ్య లుకలుకలున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య  సాన్నిహిత్యం దెబ్బతిందని...వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా భారత జట్టులోకి మిగతా ఆటగాళ్లు కూడా  రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. తాజాగా టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా రెండు వర్గాలుగా చీలిపోతున్నారు. 

ప్రపంచ కప్ 2019 లో అద్భుతంగా ఆడినా భారత జట్టు తుది విజేతగా నిలవలేకపోయింది. దీంతో 2023 వరల్డ్ కప్ లక్ష్యంగా ఇకపై టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు వుండాలని  ఇప్పటికే సెలెక్టర్లను బిసిసిఐ ఆదేశించింది. ఈ క్రమంలోనే వన్డే పగ్గాలను రోహిత్ శర్మ కు అప్పగించి...టెస్టుల్లో మాత్రం కోహ్లీనే కొనసాగించాలన్నది బిసిసిఐ ఆలోచనగా కనిపిస్తోంది.  గతంలో కోహ్లీకి మొదట వన్డే పగ్గాలు అప్పగించిన సమయంలో ధోనిని కూడా ఇలాగే టెస్ట్ కెప్టెన్ గా కొనసాగించారు.

మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఏమన్నాడంటే...

అయితే రోహిత్ కు టీమిండియా సారథ్య బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తాజాగా మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ కూడా రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా 2023 ప్రపంచ కప్ ఆడాలని కోరుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. '' వైట్  బాల్(వన్డే) కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాల్సిన సమయమిదే. 2023 వరల్డ్ కప్ లో భారత జట్టుకు అతడు సారథ్యం వహించాలన్నది నా కోరిక'' అంటూ జాఫర్ ట్వీట్ చేశాడు. 

ఈ ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ వరకు చేరడంతో రోహిత్ శర్మ కీలకంగా వ్యవహరించాడు.  ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాది ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన  ఆటగాడికి రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా అతడు 648 పరుగులు చేసి గోల్డెన్ బ్యాట్ విజేతగా నిలిచాడు. అయితే ఈ టోర్నీలో కోహ్లీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. దీంతో రోహిత్ ప్రాభల్యం పెరిగి ఏకంగా కోహ్లీ కెప్టెన్సీకే ఎసరు పెట్టాడు. 

మరిన్ని వార్తలు

టీమిండియా విండీస్ పర్యటన: రోహిత్ కు కోహ్లీ చెక్... సెలెక్టర్లతో మంతనాలు...?

ప్రపంచ కప్ 2019: వాటిపై ఐసిసి సీరియస్ గా దృష్టిపెట్టాలి: రోహిత్ శర్మ

టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?

ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు