ప్రపంచ కప్ 2019: టీమిండియా మిస్సయింది....కానీ రోహిత్ మాత్రం పట్టేశాడు

ఐసిసి వన్డే ప్రపంచ కప్ సమరం ముగిసింది. స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను పూర్తిచేసుకుంది. అయితే ఈ  టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన టీమిండియా సెమీస్ నుండే నిష్క్రమించింది.  అలా నిరుత్సాహపర్చిన ప్రపంచ కప్ లోనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ ను అందుకోవడం భారత క్రికెట్ ప్రియులకు కాస్త ఆనందం కలిగించింది. 
 

world cup 2019: team india opener rohit sharma won golden bat award

ఐసిసి వన్డే ప్రపంచ కప్ సమరం ముగిసింది. స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను పూర్తిచేసుకుంది. అయితే ఈ  టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన టీమిండియా సెమీస్ నుండే నిష్క్రమించింది.  ఇలా టైటిల్ పోరుకు కేవలం రెండడుగులు దూరంలో నిలిచిపోవడంతో ఆటగాళ్లే కాదు మాజీలు, అభిమానులు ఇలా యావత్ దేశం తీవ్ర నిరాశకు గురయ్యింది. అలా నిరుత్సాహపర్చిన ప్రపంచ కప్ లోనే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ ను అందుకోవడం భారత క్రికెట్ ప్రియులకు కాస్త ఆనందం కలిగించింది. 

ఈ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి  మ్యాచ్ నుండి రోహిత్ జోరు కొనసాగింది. అతడు ఏకంగా ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ఈ టోర్నీలోనే అత్యధికంగా 648  పరుగులు చేశాడు. ఇలా ఒకే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడంతో పాటు అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. దీంతో ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మ  గోల్డెన్ బ్యాట్ అందుకున్నాడు. 

ఓ ప్రపంచ కప్ టొర్నీలో అత్యధిక పరుగులు చేసి  ఈ గోల్డెన్ బ్యాట్ అందుకున్న భారత ఆటగాళ్లలో రోహిత్ మూడోవాడు. అతడి కంటే ముందు సచిన్ రెండుసార్లు, రాహుల్ ద్రావిడ్ ఒకసారి ఈ ఘనత సాధించారు. 

ఈ మెగా టోర్నీలో రోహిత్ తర్వాత అత్యధిక పరుగుల జాబితాలో డేవిడ్ వార్నర్(647) పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్(606 పరుగులు), కివీస్ కెప్టెన్ విలియమ్సన్(576 పరుగుల), ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ (556)తో తర్వాతి స్థానాల్లో నిలిచారు.  
 
ఇక బౌలర్ల విషయానికి వస్తే అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా యార్కర్ స్పెషలిస్ట్ స్టార్స్ కు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. అతడు ఏకంగా 27 వికెట్లు పడగొట్టి  ఈ  అవార్డును పొందడమే కాదు ఓ ప్రపంచ కప్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా  చరిత్ర సృష్టించాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios