Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్ క్రికెటర్లకు ఇక బుద్ధి రాదా..? గవాస్కర్ ఫైర్

బౌలర్‌ బంతిని విసరడానికి ముందే క్రీజు నుంచి బయటకి వచ్చి పరుగు తీయటంలో అనుచిత లబ్ది పొందుతున్న బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేయడాన్ని మన్కడింగ్‌ అని పిలవటాన్ని, అదేదో క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ముద్ర వేయటాన్నీగవాస్కర్‌ తప్పుబట్టాడు. 

Sunil Gavaskar Slams The Usage Of Word Mankading, Suggests A New name For It
Author
Mumbai, First Published Oct 8, 2020, 10:48 AM IST

క్రీడా స్ఫూర్తి మిథ్య. మైదానంలో హద్దులు దాటేందుకు ఓ గీత ఉందనటం అంతకంటే మిథ్య అని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు.  ఐపీఎల్‌లో మరోసారి చర్చనీయాంశమైన మన్కడింగ్‌పై సునీల్‌ గవాస్కర్‌ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాడు.  

బౌలర్‌ బంతిని విసరడానికి ముందే క్రీజు నుంచి బయటకి వచ్చి పరుగు తీయటంలో అనుచిత లబ్ది పొందుతున్న బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేయడాన్ని మన్కడింగ్‌ అని పిలవటాన్ని, అదేదో క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ముద్ర వేయటాన్నీగవాస్కర్‌ తప్పుబట్టాడు. 

రాయల్‌ చాలెంబర్స్ బెంగళూర్‌తో మ్యాచ్‌లో  అరోన్‌ ఫించ్‌ను ముందుగానే గీత దాటినా.. అశ్విన్‌ అతడిని అవుట్‌ చేయలేదు. ఆ ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ... 2020లో బ్యాట్స్‌మన్‌లకు ఇదే ఆఖరు హెచ్చరిక అని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు.  

మన్కడింగ్‌ కాదు.. బ్రౌన్‌ !

అరోన్‌ ఫించ్‌ను అశ్విన్‌ను వదిలేస్తూ హెచ్చరించగానే నా మదిలో ఒకే విషయం మెదిలింది. 1947 సిడ్నీ టెస్టులో ఆసీస్‌ ఓపెనర్‌ బిల్లీ బ్రౌన్‌ను వినూ మన్కడ్‌ అవుట్‌ చేశాడు. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం.

ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంకెప్పుడు నేర్చుకుంటారు? బౌలర్‌ బంతిని సంధించేటప్పుడు ఎప్పుడు బంతిని వదులుతున్నాడనేది నాన్‌ స్ట్రయిక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ చూడాలి. అరోన్‌ ఫించ్‌ మాదిరిగా బ్యాట్సమన్‌ను చూడకూడదు.

ఈ విషయంలో రూల్స్‌ స్పష్టంగా ఉన్నాయి. చాలా సింపుల్‌గా ఉన్నాయి.  వినూ మన్కడ్‌ భారత క్రికెట్‌ లెజెండ్‌. భారత్‌కు ఎన్నో మ్యాచులు గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో తప్పు చేసింది, నిబంధనలు అతిక్రమించిది బిల్లీ బ్రౌన్‌. వినూ మన్కడ్‌ కాదు. ఇకపై ఈ రనౌట్‌ను మన్కడింగ్‌ అనకూడదు. బ్రౌన్‌ రనౌట్‌ అనాలి.

భారత క్రికెట్‌ దిగ్గజం పేరును ప్రతికూలార్థంలో వాడటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. భారత మీడియా సైతం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రూల్స్‌ పాటించకుండా క్రీజు వదిలిన బ్యాట్స్‌మన్‌దే తప్పు. అవుట్‌ చేసేన బౌలర్‌ది కానే కాదు.

క్రీడాస్ఫూర్తి.... ఓ మిథ్య!

అశ్విన్‌ మన్కడింగ్‌ చేయడాన్ని నేను అనుమతించను, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఐపీఎల్‌ 2020 ఆరంభానికి ముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తి అంటేనే ఓ మిథ్య అని సునీల్‌ గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు. మన్కడింగ్‌కు వ్యతిరేకంగా డిఫెన్స్‌ చేయటం ఓ మిథికల్‌ కాన్సెప్ట్‌. ఆసీస్‌ మైదానంలో హద్దులు దాటి ప్రవర్తించమని చెప్పినంత మిథ్యా సిద్దాంతం! అని గవాస్కర్‌ కంగారూ క్రికెటర్లపై ఫైర్‌ అయ్యాడు.  క్రీడాస్ఫూర్తి రూపంలో నైతిక విలువలు తెరపైకి వచ్చి.. ఈ రనౌట్‌లను వివాదాస్పదం చేస్తున్నాయి. నిజానికి అలా బంతి విసరకముందే క్రీజు వదిలి బయటకు రావటం అన్‌స్పోర్ట్స్‌మన్‌షిప్‌ అవుతుంది. అలా వచ్చిన వారిని రనౌట్‌ చేయటం క్రీడాస్ఫూర్తికి ఏ మాత్రం వ్యతిరేకం కాదు.

ఓ పరుగు కుదించాలి!.

క్రికెట్‌ పుస్తకాల్లో, నిబంధనల్లో ఈ విషయంపై కావాల్సినంత స్పష్టత ఉంది. బౌలర్‌ బంతిని విసిరే సమయంలో ఎప్పుడు బంతిని వదులుతున్నాడనే విషయాన్ని నాన్‌ స్ట్రయికర్‌ గమనించాలి.

అలా కాకుండా బ్యాట్స్‌మన్‌ను గమనిస్తూ ముందుగానే క్రీజు వదలి వెళ్లకూడదు. అయినా బ్యాట్స్‌మెన్‌ క్రీజు వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు నో బాల్స్‌ కోసం ప్రతి బంతిని మూడో అంపైర్‌ గమనిస్తున్నారు.

అదే తరహాలో నాన్‌ స్ర్టయికర్‌ క్రీజు వదిలి వెళ్లడాన్ని కూడా గమనించాలి. ఒకవేళ ముందుగానే బయటకు వస్తే ఓ పరుగును కుదించాలి. ప్రతీసారీ ఇలాగే చేయాలి. బౌలర్‌ రనౌట్‌కు ప్రయత్నించినా, లేకపోయినా థర్డ్‌ అంపైర్‌ అ పని చేయాలి అని గవాస్కర్‌ సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios