టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరోసారి రెచ్చిపోయాడు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్.... డబుల్ సెంచరీ చేశాడు.  గతేడాది జూనియర్ క్రికెట్ లో రెండు శతకాలు బాది అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న సమిత్... తాజాగా అండర్-14 బీటీఆర్ షీల్డ్ మ్యాచ్ లో  డబుల్ సెంచరీ చేశాడు.

కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ సత్తా చాటడం గమనార్హం. రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి సహకరించాడు. మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున బరిలోకి దిగిన సమిత్ ద్రవిడ్ 33 ఫోర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. 

Also Read నవ్వుతూనే ఉన్నా, ద్రావిడ్.. సచిన్ సార్ల వల్లనే: యశస్వి జైశ్వాల్.

దీంతో.. మాల్యా టీమ్ 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. అనంతరం ఛేదనలో తడబడిన శ్రీ కుమారన్ టీమ్.. పేలవరీతిలో 110 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో సమిత్ ద్రవిడ్.. రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో.. ఏకంగా 267 పరుగుల తేడాతో మాల్యా టీమ్ విజయాన్ని అందుకుంది.

గత ఏడాది డిసెంబరులో అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్ తరఫున ఆడిన సమిత్ ద్రవిడ్.. 256 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 201 పరుగులు చేశాడు. దీంతో.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే సమిత్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసినట్లయింది.