గ్యాస్ సిలిండర్ పేలి బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిస్వాస్ సంచిత తీవ్ర గాయాలైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గత శుక్రవారం వంట గదిలో టీ పెడుతుండగా.. సిలిండర్ పేలడంతో సంచిత చేతులు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read పాకిస్తాన్ కి సాయం చేయాలంటూ వీడియో.. యూవీని ఏకిపారేస్తున్న నెటిజన్లు...

టీ పెట్టేందుకని వంట గదిలోకి వెళ్లిన ఆమె గ్యాస్ స్టవ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ముఖాన్ని రక్షించుకునే క్రమంలో చేతులకు గాయాలయ్యాయని  కుటుంబసభ్యులు తెలిపారు. పేలుడు ధాటికి కిచెన్ కేబినెట్ కూలి ఆమెపై పడడంతో కాళ్లకి, ముఖానికి కూడా గాయాలయ్యాయి.

కాగా.. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగినా ఆమె ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగు చూసింది. 'ఆ ప్రమాదం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చావుకి చాలా దగ్గరగా వెళ్లినట్లు అనిపించింది. నా చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోలేకపోతే.. నా ముఖం మొత్తం కాలిపోయేది. నిప్పు అంటుకుని ఉండటంతో.. నా హెయిర్‌ని కూడా కట్ చేయాలని వైద్యులు తెలిపారు. ఒకవేళ నా ముఖం కాలి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి'అని తెలిపింది. 
2019లో ప్రపంచకప్ తర్వాత లిటన్ దాస్, దేవశ్రీల వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం క్రికెటర్లతో పాటు లిటన్ దాస్ కూడా ఇటీవల తన సగం జీతాన్ని విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.