11:08 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ 64/1 పరుగులు

భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టు మూడో రోజు ఆటను టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులతో ముగించింది. జైస్వాల్ 28 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. క్రీజులో కేఎల్ రాహుల్ 28 పరుగులు, కరుణ్ నాయర్ 7 పరుగులతో ఉన్నారు. 

ఇండియా: 587 & 64/1 (13)

ఇంగ్లాండ్: 407

Scroll to load tweet…

10:47 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌ద్రావిడ్, సెహ్వాగ్ రికార్డులను సమం చేసిన యశస్వి జైస్వాల్

India vs England 2nd Test Day 3 Live 

టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌లు

టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగుల మైలురాయిని అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలో చేరుకున్న భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ చేరాడు. కేవలం 40 ఇన్నింగ్స్ లలోనే జైస్వాల్ టెస్టు క్రికెట్ లో రెండువేల పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు 40 ఇన్నింగ్స్ లలోనే దిగ్గజ ప్లేయర్లు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ లు 2 వేల పరుగులు సాధించారు.

  • 40 ఇన్నింగ్స్ లు- ద్రావిడ్, సెహ్వాగ్, జైస్వాల్
  • 43 ఇన్నింగ్స్‌లు - విజయ్ హజారే, గౌతమ్ గంభీర్
  • 44 ఇన్నింగ్స్‌లు - సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్
  • 45 ఇన్నింగ్స్‌లు - సౌరవ్ గంగూలీ
  • 46 ఇన్నింగ్స్‌లు: చతేశ్వర్ పుజారా

Scroll to load tweet…

09:58 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌407 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ కు 180 పరుగుల ఆధిక్యం

India vs England, 2nd Test Day 3 Live: ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 407-10 (89.3 ఓవర్లు)

జేమీ స్మిత్ 184* నాటౌట్ 

హ్యారీ బ్రూక్ 150 పరుగులు 

భారత్ బౌలింగ్:

సిరాజ్ 6 వికెట్లు 

అకాశ్ దీప్ 4 వికెట్లు

భారత్ తొలి ఇన్నింగ్స్: 587-10 (151 ఓవర్లు) 

శుభ్ మన్ గిల్ 269 పరుగులు 

యశస్వి జైస్వాల్ 87

రవీంద్ర జడేజా 89

వాషింగ్టన్ సుందర్ 42

ఇంగ్లాండ్ బౌలింగ్:

షోయబ్ బషీర్ 3 వికెట్లు 

క్రిస్ వోక్స్ 2 వికెట్లు 

టాంగ్ 2 వికెట్లు 

09:37 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌క్రిస్ వోక్స్, కార్స్ అవుట్.. 8 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

India vs England Live: క్రిస్ వోక్స్ కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. ఆకాష్ దీప్ మరోసారి మంచి లెంగ్త్ బాల్‌ వేసి వోక్స్ వికెట్ తీశాడు.

వోక్స్ బంతిని లెగ్ సైడ్‌కి ఆడటానికి ప్రయత్నించాడు, కానీ బ్యాట్‌పై ముందు భాగంలో తగిలి బాల్ గాల్లోకి లేచింది. కరుణ్ నాయర్ అద్భుతమైన క్యాచ్ తో వోక్స్ ను పెవిలియన్ కు పంపాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రైడాన్ కార్స్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యడు.

ఇంగ్లండ్ స్కోర్ 396/8 (87.5 ఓవర్లు)

జేమీ స్మిత్ 174* పరుగులు

Scroll to load tweet…

09:27 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌హ్యారీ బ్రూక్, స్మిత్ రికార్డు భాగస్వామ్యం

India vs England Live: హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌ల మధ్య నమోదైన 303 పరుగుల భాగస్వామ్యం టెస్ట్ క్రికెట్ చరిత్రలో పలు రికార్డులను నెలకొల్పింది.

ఆరో వికెట్ లేదా అంతకంటే తక్కువ వికెట్‌కు ఇంగ్లండ్‌కు ఇది మూడో 300-ప్లస్ భాగస్వామ్యం. గతంలో 2016లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాపై బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టోల మధ్య 399 పరుగులు భాగస్వామ్యం ఉంది. అలాగే, 2010లో లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై జోనాథన్ ట్రాట్, స్టువర్ట్ బ్రాడ్‌ల మధ్య 332 పరుగులు భాగస్వామ్యం ఉంది.

భారత్‌పై ఇంగ్లాండ్‌కు ఇది మూడో 300+ భాగస్వామ్యంగా నిలిచింది. గతంలో 2011లో ఓవల్‌లో ఇయాన్ బెల్, కెవిన్ పీటర్సన్‌ల మధ్య 350 పరుగులు, 1990లో లార్డ్స్‌లో గ్రాహం గూచ్, అలాన్ ల్యాంబ్‌ల మధ్య 308 పరుగులు భాగస్వామ్యం ఉంది.

Scroll to load tweet…

09:13 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌సెంచరీ హీరో హ్యారీ బ్రూక్ అవుట్

India vs England Live: ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి సెంచరీ ఇన్నింగ్స్ తో దుమ్మురేపిన హ్యారీ బ్రూక్ 158 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

ఇంగ్లాండ్ 387-6 (83 ఓవర్లు).

జేమీ స్మిత్ 170* పరుగులు

క్రిస్ వోక్స్ 0*

Scroll to load tweet…

08:10 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌Harry Brook: హ్యారీ బ్రూక్ సెంచరీ.. జేమీ స్మిత్ సునామీ బ్యాటింగ్

India vs England: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో భారత్ పై ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టాడు. ఇది తన కెరీర్ లో 9వ సెంచరీ. అంతకుముందు జేమీ స్మిత్ కూడా తుఫాను సెంచరీ కొట్టాడు.

Read Full Story
06:51 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌హ్యారీ బ్రూక్ సెంచరీ

Harry Brook: ప్రసిద్ధ్ బౌలింగ్ ఫోర్ కొట్టి తన 9వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు హ్యారీ బ్రూక్. కేవలం 27వ టెస్టులోనే 9వ సెంచరీ కొట్టాడు. మపూర్తి చేసుకున్నాడు.

Scroll to load tweet…

06:11 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌Jamie Smith : 4 6 4 4 4.. దంచికొడుతున్న జేమీ స్మిత్.. తుపాను సెంచరీ

India vs England: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్లు జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ లు బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. జేమీ స్మిత్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

Read Full Story
05:42 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌80 బంతుల్లోనే సెంచరీ కొట్టిన జేమీ స్మిత్

India vs England, 2nd Test Day 3 Live: జేమీ స్మిత్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్ 102 పరుగుల ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. హ్యారీ బ్రూక్ 91 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ 249/5 (47 ఓవర్లు) పరుగులతో ఆడుతోంది.

Scroll to load tweet…

04:49 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌జేమీ స్మిత్ హాఫ్ సెంచరీ

India vs England 2nd Test Day 3 Live: ఇంగ్లాండ్ బ్యాటర్ జేమీ స్మిత్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 43 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. జెమీ స్మిత్ 57 పరుగులతో ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.

Scroll to load tweet…

04:37 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌Ind vs Eng - ఇంగ్లాండ్ లో డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు ఎవరు?

India vs England: ఇంగ్లాండ్‌లో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో తాజాగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా చేరారు. 269 పరుగులు డబుల్ సెంచరీ నాక్ తో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించింది.

Read Full Story
03:54 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌బెన్ స్టోక్స్ గోల్డెన్ డక్‌ ఔట్

India vs England, 2nd Test Day 3 Live: మహమ్మద్ సిరాజ్ మరోసారి విజృంభించాడు. బెన్ స్టోక్స్ ను అద్భుతమైన బాల్ తో అవుట్ చేశాడు. పంత్ మరొక అద్భుత క్యాచ్‌తో స్టంప్స్ వెనక నిలబడి వికెట్ అందించాడు. బెన్ స్టోక్స్ గోల్డెన్ డక్‌కు ఔట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ 21.4 ఓవర్లలో 83 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.

03:52 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌జో రూట్ అవుట్

India vs England, 2nd Test Day 3 Live : మూడో రోజు ఆటతో భారత్ కు మంచి ఆరంభం లభించింది. మహమ్మద్ సిరాజ్ రెండో ఓవర్‌లోనే కీలక వికెట్ పడగొట్టాడు. జో రూట్‌ను ఔట్ చేశాడు. ఆఫ్ స్టంప్ బయటకు వచ్చిన బంతిని రూట్ కొట్టే ప్రయత్నంలో ఎడ్జ్ అయింది. వికెట్‌కీపర్ పంత్ ఈజీ క్యాచ్ పట్టాడు.

రూట్ 46 బంతుల్లో 22 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ 21.3 ఓవర్లలో 84 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

03:36 PM (IST) Jul 04

India vs England 2nd Test Day 3 Live : భారత్ vs ఇంగ్లాండ్ లైవ్ అప్‌డేట్స్‌భారత్ vs ఇంగ్లాండ్ 2వ టెస్టు డే 3 లైవ్ అప్‌డేట్స్‌

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 587 పరుగుల భారీ స్కోరు చేస్తూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఇంగ్లాండ్ రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. మూడో రోజు ఆటను కొనసాగించడానికి జో రూట్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు.