MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!

IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!

Hardik Pandya : అహ్మదాబాద్‌లో జరిగిన 5వ టీ20లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. యువరాజ్ సింగ్ తర్వాత టీమిండియా తరఫున వేగవంతమైన రెండో హాఫ్ సెంచరీని హార్దిక్ బాదాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 19 2025, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యువరాజ్ రికార్డు జస్ట్ మిస్.. అభిషేక్ శర్మను దాటేసిన హార్దిక్ పాండ్యా
Image Credit : Getty

యువరాజ్ రికార్డు జస్ట్ మిస్.. అభిషేక్ శర్మను దాటేసిన హార్దిక్ పాండ్యా

అహ్మదాబాద్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. యువరాజ్ సింగ్ రికార్డుకు చేరువగా వచ్చి, కేవలం కొన్ని బంతుల తేడాతో మిస్ అయ్యాడు. కానీ యంగ్ సునామీ అభిషేక్ శర్మ రికార్డును మాత్రం హార్దిక్ బద్దలు కొట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాస్ ఓడినా.. తగ్గేదేలే అంటూ రెచ్చిపోయిన భారత్
Image Credit : AFP

టాస్ ఓడినా.. తగ్గేదేలే అంటూ రెచ్చిపోయిన భారత్

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పిచ్‌ను పరిశీలించి ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావించాడు. టాస్ ఓడినా భారత్‌కు కోరుకున్న బ్యాటింగే దక్కింది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీ జట్టుకు శుభారంభాన్ని అందించింది. శాంసన్ ప్రోటీస్ జట్టు బౌలర్లపై విరుచుకుపడుతూ 37 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 34 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ కలిసి జట్టుకు బలమైన పునాది వేశారు.

Related Articles

Related image1
IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
Related image2
IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
35
తిలక్, హార్దిక్ జోడీ విధ్వంసం
Image Credit : Getty

తిలక్, హార్దిక్ జోడీ విధ్వంసం

ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించాడు. తిలక్ వర్మ కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్, 42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

మరోవైపు హార్దిక్ పాండ్యా మైదానంలోకి అడుగుపెట్టడంతోనే స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించడం విశేషం. ఆ తర్వాత బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు. తిలక్ వర్మతో కలిసి నాలుగో వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

45
హార్దిక్ పాండ్యా రికార్డుల మోత
Image Credit : X

హార్దిక్ పాండ్యా రికార్డుల మోత

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. హార్దిక్ పాండ్యా మొత్తం 25 బంతులు ఎదుర్కొని 63 పరుగులు చేశాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఇదే ఏడాది ఇంగ్లాండ్‌పై అభిషేక్ శర్మ 17 బంతుల్లో చేసిన అర్ధశతకం రికార్డును హార్దిక్ పాండ్యా అధిగమించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అభిషేక్ ఆ ఫీట్ సాధించగా, ఇప్పుడు అహ్మదాబాద్ లో  హార్దిక్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో హార్దిక్ కంటే వెనుకబడ్డాడు. రాహుల్, సూర్య ఇద్దరూ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికార్డు కలిగి ఉన్నారు.

55
యువరాజ్ సింగ్ రికార్డు సేఫ్
Image Credit : AFP

యువరాజ్ సింగ్ రికార్డు సేఫ్

భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పటికీ దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరు మీదే ఉంది. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. డర్బన్ లో జరిగిన ఆ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే.

గడిచిన 18 ఏళ్లుగా ఏ భారతీయ బ్యాటర్ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. తాజాగా హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆ రికార్డుకు దగ్గరగా వచ్చినా, కేవలం 4 బంతుల తేడాతో యువరాజ్ రికార్డు ను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ, హార్దిక్ ఇన్నింగ్స్ టీ20 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీలు

  • 12 బంతులు - యువరాజ్ సింగ్ (vs ఇంగ్లాండ్, 2007)
  • 16 - హార్దిక్ పాండ్యా (vs సౌతాఫ్రికా, 2025)
  • 17 - అభిషేక్ శర్మ (vs ఇంగ్లాండ్, 2025)
  • 18 - కేఎల్ రాహుల్ (vs సౌతాఫ్రికా, 2021)
  • 18 - సూర్యకుమార్ యాదవ్ (vs సౌతాఫ్రికా, 2022)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
Recommended image2
IPL 2026 : 9 మంది ఆల్‌రౌండర్లతో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్.. కానీ ఆ ఒక్కటే చిన్న భయం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved