Asianet News TeluguAsianet News Telugu

మ‌రింతగా పెరిగిన భార‌త్ క‌ష్టాలు.. విశాఖ టెస్టులో ఇంగ్లాండ్‌కు ఎదురునిలిచేనా..?

IND vs ENG, 2nd Test: విశాఖ వేదిక‌గా ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లాండ్ తో టీమిండియా రెండో టెస్టు ఆడ‌నుంది. అయితే, తొలి టెస్టులో ఓట‌మిని చ‌విచూసిన భార‌త్.. విర‌ట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ష‌మీ వంటి ప్లేయ‌ర్లు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. 
 

IND vs ENG : India's difficulties have increased. Will India beat England in the Visakhapatnam Test? RMA
Author
First Published Jan 30, 2024, 3:34 PM IST

India vs England 2nd Test: తిరుగులేని రికార్డు ఉన్న హైద‌రాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఓట‌మిని చ‌విచూసింది. ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ దూరంగా ఉండ‌గా, తొలి టెస్టులో రాణించిన ర‌వీంద్ర జ‌డేజా, కేఎల్ రాహుల్ లు కూడా జ‌ట్టుకు దూరం కావ‌డం భార‌త్ క‌ష్టాల‌ను మ‌రింత పెంచింది.  విశాఖ‌ప‌ట్నం వేదిక జ‌ర‌గ‌నున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కు భార‌త్ ఎదురు నిలుస్తుందా?  లేక మ‌ళ్లీ హైద‌రాబాద్ టెస్టు త‌ర‌హాలో ఈ మ్యాచ్ ను కూడా ముగిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ముగ్గురు స్టార్ ప్లేయర్లు దూరం.. 

రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తొలి టెస్టులో గాయపడటం భారత జట్టులో టెన్షన్ పెంచింది. ఇప్పటికే 5 టెస్టుల‌ సిరీస్ లో ఆ జట్టు 1-0తో వెనుకబడి ఉంది. హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో జడేజా, రాహుల్ అద్భుతంగా రాణించినా, రెండో ఇన్నింగ్స్ లో అద్భుత ఆటతీరుతో ఇంగ్లాండ్ భార‌త్ ను దెబ్బ‌కొట్టింది. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు జ‌ట్టుకు దూరం కావ‌డం పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.  భార‌త స్టార్ ఆల్ రౌండర్ జడేజా ఆ లోటును భర్తీ చేయడం కష్టమనీ, సెప్టెంబర్ లో శస్త్రచికిత్స నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి రాహుల్ వన్డేలు, టెస్టుల్లో మంచి ఫామ్ ను కనబరుస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ ముగ్గురు కూడా రెండో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయారు.

ఎవ‌రీ దీప్ గ్రేస్ ఎక్కా? ఒలింపిక్స్ ముందు భార‌త హాకీకి బిగ్ షాక్.. !

భారత్ ముందు ఎన్నో సవాళ్లు..

విశాఖపట్నంలో ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. కీల‌క ప్లేయ‌ర్లు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. వీరి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లకు సెలక్టర్లు తుది జట్టులో చోటు కల్పించారు. హైదరాబాద్లోని 15 మంది సభ్యుల భారత జట్టులో రజత్ పాటిదార్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్ లో అత‌ను రాహుల్ స్థానాన్ని భర్తీ చేసే అవ‌కాశ‌ముండ‌గా, జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకోవ‌చ్చు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ మాదిరిగా నలుగురు స్పిన్నర్లు, ఒక ఫాస్ట్ బౌలర్ తో భారత జట్టు బరిలోకి దిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిడిలార్డర్ లో సర్ఫరాజ్ ఖాన్ లేదా వాషింగ్టన్ సుంద‌ర్ ను జ‌ట్టునుంచి త‌ప్పించ‌వ‌చ్చు. మహ్మద్ సిరాజ్ కంటే కుల్దీప్ యాద‌వ్ కు ఎక్కువ‌ ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. 

TFI Fans Cricket: దేవరను దెబ్బ‌కొట్టిన‌ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. !

జడేజా స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందో..?

తొలి టెస్టులో బ్యాట్, బాల్ తో అద‌ర‌గొట్టిన జ‌డేజా స్థానంలో రెండో టెస్టు కోసం ఎవ‌రిని జ‌ట్టులోకి తీసుకుంటార‌నేది ఆస‌క్తిని పెంచింది. జడేజా మాదిరిగానే సౌరభ్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కుల్దీప్ యాద‌వ్ కు ప్లేయింగ్-11లో చోటు కల్పించాలని భార‌త‌ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఒక ఫాస్ట్ బౌలర్ మాత్రమే పని చేస్తాడని భారత్ భావిస్తే కుల్దీప్ యాద‌వ్ ను జట్టులో ఉంచాల‌న్నారు. ఇటీవ‌ల మంచి ఫామ్ ను కొన‌సాగిస్తున్న ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్  కూడా గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు.

ఆల్ రౌండ‌ర్ అవసరమని పేర్కొన్న భార‌త జ‌ట్టు మాజీ సెల‌క్ట‌ర్ శ‌ర‌ణ్ దీప్ సింగ్.. ప్లేయింగ్-11లో పెద్దగా ట్యాంపరింగ్ ఉండకూడదని అన్నారు. రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్, జడేజా స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ను అనుక‌రిస్తే నలుగురు స్పిన్నర్లను ఆడించాల్సిన అవసరం త‌మ‌కు లేద‌నీ, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లు స్వ‌దేశంలో మంచి బ‌ల‌మ‌నీ, శుభ్ గన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని, రోహిత్ శర్మ మూడో స్థానంలో ఆడాలని సూచించారు.

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

Follow Us:
Download App:
  • android
  • ios