TFI Fans Cricket: దేవరను దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. !
TFI Fans Cricket: తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీలో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టోర్నీలో పవన్ కళ్యాణ్ టీమ్ హంగ్రీ చీతాస్.. ఎన్టీఆర్ అభిమానులకు చెందిన టైగర్స్ ఎలెవన్ టీమ్ ను దెబ్బకొట్టింది.
TFI Fans Cricket: టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసి 12 జట్లు, 4 గ్రూపులుగా ఏర్పడి తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఆడుతున్నారు. తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీ క్రికెట్ లవర్స్ ను అలరిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తొలి మ్యాచ్ తో లీగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ గ్రౌండ్ లో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ ఫిబ్రవరి 2న ఇదే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.
తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌ఐ) ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీలో తొలి మ్యాచ్ లో టైగర్స్ ఎలెవన్ పై పవన్ కళ్యాణ్ టీమ్ హంగ్రీ చీతాస్ విజయం సాధించింది. దేవర ఎన్టీఆర్ టైగర్స్ ఎలెవన్ జట్టుపై ఓజీ పవన్ కళ్యాణ్ హంగ్రీ చీతాస్ 83 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగ్రీ చీతాస్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది.
ఈ ప్రపంచంలో నా ప్రయాణం ముగిసింది అనుకున్నా.. తన యాక్సిడెంట్ పై రిషబ్ పంత్
182 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీమ్ టైగర్స్ ఎలెవన్ 109 పరుగులకే కుప్పకూలింది. పవన్ కళ్యాణ్ టీమ్ హంగ్రీ చీతాస్ బౌలర్ బౌలర్ యాశ్వంత్ విజృంభణతో 17.3 ఓవర్లలో టైగర్స్ ఎలెవన్ ఆలౌట్ అయింది. యాష్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి టైగర్స్ ఎలెవన్ ను దెబ్బకొట్టాడు. హంగ్రీ చీతాస్ విజయంలో కీలక పాత్ర పోషించిన యాష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !