Asianet News TeluguAsianet News Telugu

ఎవ‌రీ దీప్ గ్రేస్ ఎక్కా? ఒలింపిక్స్ ముందు భార‌త హాకీకి బిగ్ షాక్.. !

Deep Grace Ekka: పెనాల్టీ కార్న‌ర్ ఎక్స్‌ప‌ర్ట్‌గా పేరొందిన భార‌త హాకీ క్రీడాకారుణి దీప్ గ్రేస్ ఎక్కా రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్ గురిచేశారు. అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగిన ఆమె ప్రయాణం హాకీ క్రీడపై చెరగని ముద్ర వేసింది.
 

Who is Deep Grace Ekka? Indian women's hockey star player announces retirement RMA
Author
First Published Jan 30, 2024, 2:48 PM IST

Deep Grace Ekka:  భార‌త హాకీ స్టార్ ప్లేయ‌ర్ దీప్ గ్రేస్ ఎక్కా అంద‌రినీ షాక్ గురిచేస్తూ హాకీ కి గుడ్ బై చెప్పారు. పారీస్ ఒలింపిక్స్ క్రీడ‌ల‌కు ముందు ఆమె రిటైర్మెట్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. 1994 జూన్ 3న ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలోని లుల్కిది గ్రామంలో జన్మించిన దీప్ గ్రేస్ ఎక్కా.. భారత మహిళల హాకీలో ప్రముఖ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించారు. త‌ల్లిదండ్రులు చార్లెస్, జయమణి ఎక్కాలతో పేద కుటుంబంలో క‌లిసి పెరిగిన ఆమె అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగిన ప్రయాణం క్రీడపై చెరగని ముద్ర వేసింది.

కోచ్ తేజ్ కుమార్ జెస్ మార్గదర్శకత్వంలో పాఠశాలలో హాకీతో దీప్ గ్రేస్ ఎక్కా త‌న హాకీ ప్ర‌యానం మొద‌లు పెట్టింది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ సాయంతో 2007లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన సాయ్-ఎస్ఏజీ కేంద్రంలో చేరి కేవలం 13 ఏళ్లకే రాష్ట్రస్థాయిలో అరంగేట్రం చేసింది. 16 సంవత్సరాల వయస్సులో సీనియర్ నేషనల్స్ లో స్థానం సంపాదించింది.

గోల్ కీపింగ్ కలలు..

మొద‌ట్లో గోల్ కీపర్ కావాలనుకున్న దీప్ గ్రేస్ ఎక్కా ప్రణాళికలు ఊహించని మలుపు తిరిగాయి. అప్పుడప్పుడు తన సోదరుడితో కలిసి గోల్ లో ఆడినప్పటికీ, ఆమె కోచ్, మామ ఆమెను డిఫెన్స్ వైపు మళ్లించారు. ఈ ట్విస్ట్ ఆమె డిఫెన్సివ్ లైనప్ లో ఒక బలమైన క్రీడాకారిణిగా మారడానికి దారితీసింది. 

ఈ ప్ర‌పంచంలో నా ప్ర‌యాణం ముగిసింది అనుకున్నా.. త‌న యాక్సిడెంట్ పై రిష‌బ్ పంత్

అంతర్జాతీయ అరంగేట్రంలో అనేక మైలురాళ్లు

2011లో అర్జెంటీనాలో జరిగిన ఫోర్ నేషన్స్ టోర్నమెంట్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి దీప్ గ్రేస్ ఎక్కా తన అంత‌ర్జాతీయ‌ కెరీర్ ను షురూ చేసింది. బ్యాంకాక్ లో జరిగిన అండర్ -18 బాలికల ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జ‌ట్టులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. 2016 రియో ఒలింపిక్స్ కు భారత్ అర్హత సాధించడంలో మైదానంలో దీప్ గ్రేస్ ఎక్కా ఆట కీల‌క పాత్ర పోషించింది.

త‌న రిటైర్మెంట్ గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన దీప్ గ్రేస్ ఎక్కా.. 2011 నుంచి 2023 వరకు సాగిన త‌న హాకీ ప్ర‌యాణంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంద‌నీ, ఇందుకు స‌హ‌క‌రించిన వారికి ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం, 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, 2016 మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, 2017 ఆసియా కప్, 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో ప‌త‌కాలు రావ‌డంతో కీల‌క పాత్ర పోషించారు. 2013లో జూనియర్, సీనియర్ జట్లతో కలిసి మహిళల ఆసియా కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీల్లో వరుసగా కాంస్యం, రజత పతకాలు గెలుచుకోవడంలో ఆమె బహుముఖ ప్రజ్ఞ, నిబద్ధత సుస్పష్టం.

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. ! 

తన రిటైర్మెంట్ ప్రకటనలో దీప్ గ్రేస్ ఎక్కా త‌న సహచరులు, కోచ్ ల‌కు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. హాకీ ఇండియా, హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిశా, ఒడిశా ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పోషించిన కీలక పాత్రను గుర్తించిన ఆమె వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మహిళల హాకీపై ఎక్కా దశాబ్దకాలం చూపిన‌ ప్రభావాన్ని ప్రశంసించారు. ఆమె క్రీడాస్ఫూర్తిని, జట్టు ఎదుగుదలకు అపారమైన కృషిని కొనియాడారు. ఒడిశాతో పాటు దేశవ్యాప్తంగా ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.

TFI Fans Cricket: దేవరను దెబ్బ‌కొట్టిన‌ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. !

 

Follow Us:
Download App:
  • android
  • ios