MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • RCB vs SRH : హైదరాబాద్ కొట్టే రన్స్ ఓకే.. IPL 2026 లో వికెట్లు తీసేదెవరు?

RCB vs SRH : హైదరాబాద్ కొట్టే రన్స్ ఓకే.. IPL 2026 లో వికెట్లు తీసేదెవరు?

RCB vs SRH : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగంపై ఆర్‌సీబీ మాజీ స్టార్ డూ ప్లెసిస్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మార్చి 28న బెంగళూరులో ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మధ్య ఐపీఎల్ 2026 ఎడిషన్ తొలి మ్యాచ్ జరగనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 15 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్‌ఆర్‌హెచ్‌కి షాకిచ్చిన ఆర్‌సీబీ స్టార్.. ఆ ఒక్క విషయంలో హైదరాబాద్ వీక్
Image Credit : ANI

ఎస్‌ఆర్‌హెచ్‌కి షాకిచ్చిన ఆర్‌సీబీ స్టార్.. ఆ ఒక్క విషయంలో హైదరాబాద్ వీక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ సమరానికి నగారా మోగింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో తొలి రోజే డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందే ఆర్‌సీబీ మాజీ కెప్టెన్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డూ ప్లెసిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో లోపాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌పై డూ ప్లెసిస్ ఏమన్నారంటే?
Image Credit : X/ Tanuj

ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌పై డూ ప్లెసిస్ ఏమన్నారంటే?

జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన 'గేమ్ ప్లాన్ - నో యువర్ టీమ్' కార్యక్రమంలో డూ ప్లెసిస్ ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కూర్పును విశ్లేషించారు. "నేను సన్‌రైజర్స్‌ను చూస్తుంటే, నాకు టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు గుర్తుకు వస్తోంది. వారిది అత్యంత శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్. కానీ ఆ స్క్వాడ్‌ను చూసినప్పుడు నాకు ఒక సందేహం వస్తోంది.. వికెట్లు తీసే బౌలర్లు ఎవరు? కెప్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, క్లిష్ట సమయంలో ప్యాట్ కమిన్స్ ఎవరికి బంతిని అందిస్తాడు?" అని డూ ప్లెసిస్ ప్రశ్నించారు. కమిన్స్ మినహా వికెట్లు తీసే సమర్థులైన బౌలర్లు జట్టులో కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

35
బ్యాటింగ్‌తోనే ప్రత్యర్థిని భయపెట్టాలి
Image Credit : ipl media

బ్యాటింగ్‌తోనే ప్రత్యర్థిని భయపెట్టాలి

ఎస్‌ఆర్‌హెచ్ విజయవకాశాలపై మాట్లాడుతూ.. "బౌలింగ్‌లో స్పష్టత లేనప్పుడు, వారు బ్యాటింగ్‌లో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేయాలి. భారీ స్కోర్లు సాధించి స్కోర్‌బోర్డు ద్వారా ఒత్తిడి పెంచాలి. ఒకవేళ హైదరాబాద్ 260 వంటి భారీ స్కోరు సాధిస్తే, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యర్థి బ్యాటర్లు వికెట్లు పారేసుకుంటారు. అలా అయితేనే ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో సక్సెస్ అవుతుంది" అని డూ ప్లెసిస్ విశ్లేషించారు. గత సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్ 287, 278 వంటి భారీ స్కోర్లతో ఇప్పటికే రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

45
అభిషేక్ శర్మ ఫామ్‌పై ఏమన్నారు?
Image Credit : SRH Instagram

అభిషేక్ శర్మ ఫామ్‌పై ఏమన్నారు?

యువ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ గురించి కూడా డూ ప్లెసిస్ సానుకూలంగా స్పందించారు. టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ కొంత ఇబ్బంది పడినప్పటికీ, అది ఆటలో సహజమని ఆయన పేర్కొన్నారు. "అభిషేక్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. ఫామ్‌లో ఒడిదుడుకులు రావడం సర్వసాధారణం. ప్రతి టాప్ బ్యాటర్ ఇలాంటి కాలాన్ని ఎదుర్కొంటారు. అతను తన ప్రక్రియపై దృష్టి పెట్టి బలంగా తిరిగి రావాలి" అని సూచించారు. 2024 సీజన్‌లో 41 సిక్సర్లతో రికార్డు సృష్టించిన అభిషేక్, ఈసారి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు కీలకం కానున్నాడు.

55
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఇదే
Image Credit : SRH Insta

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఇదే

బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశంలోని మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత విడుదల చేయనున్నారు. తొలి దశ మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, గువాహటి, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో జరగనున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీని ఢీకొట్టబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ ఈసారి టైటిల్ కరవును తీర్చుకుంటుందో లేదో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
CSK : ధోనీ మాస్టర్ మైండ్.. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే స్కెచ్!
Recommended image2
Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved