కరోనావైరస్ వ్యాప్తి కారణంగ ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రజాలకు ఒకవిధంగా ఇబ్బందులు ఎదురవుతున్న మరో పక్క వివాహ శుభకార్యాలు వంటివి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితులు  ఏర్పడ్డాయి. దీంతో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో అని ఎదురు చూస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఇటువంటి సమస్యలకు పరిష్కారం కోసం న్యూ యార్క్ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. ఇప్పుడు న్యూయార్క్‌లో వివాహం చేసుకోవాలనుకుంటున్న వారు జూమ్‌ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు. న్యూయార్క్‌  గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ లైసెన్సులను అలాగే వాటిని ఆమోదించడానికి అనుమతి ఇచ్చారు.

వివాహ జంటలు ఈ లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకోవాలని కోరుకునేవారికీ ఇది కాస్త ఉపశమనం కల్పిస్తుంది. అలాగే లాక్ డౌన్ సమయంలో ఎవరైనా వారు తమ ఉద్యోగాలను కోల్పోతే వారి జీవిత భాగస్వామికి సంస్థ యజమాని అందించే ఆరోగ్య బీమాను పంచుకోవచ్చు.

మార్చి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో 20 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారని ఇంకా నిరుద్యోగ భృతి కోసం దాఖలు చేశారని యుఎస్ కార్మిక శాఖ తెలిపింది. న్యూయార్క్ లో నివసించే జంటలు తమ వివాహ దరఖాస్తును వ్యక్తిగతంగా వారే పూర్తి చేయవలసి ఉంది.

        
లాక్ డౌన్ కారణంగా, వివాహ లైసెన్సులు ఇచ్చే వివాహ బ్యూరోలు మూసివేయబడ్డాయి. న్యూయార్క్ వాసులకు రిమోట్ గా వివాహ లైసెన్స్ పొందటానికి అనుమతించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై గవర్నర్ క్యూమో శనివారం సంతకం చేయడంతో ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది.

ఈ కొత్త వివాహ లైసెన్స్ ఆర్డర్ మే 18 వరకు చెల్లుతుంది. వివాహం చేసుకోవాలనుకునే వారు వివాహ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి, వాటిని నింపి, వివాహ అనంతరం సంతకం చేయడానికి సిద్ధంగా ఉంచుతుంది.


దంపతులు, సాక్షి లేదా వివాహ పెద్దగా వ్యవహరించే వ్యక్తి, వివాహ లైసెన్స్ ఇవ్వడానికి అధికారం ఉన్న పట్టణం అధికారితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడుతుంది.

ఈ వివాహ వేడుకను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు, ఈ జంట వివాహ లైసెన్స్‌పై సంతకం చేయాలి, సంతకం చేయడానికి వివాహ సాక్షి, అటెండర్ పంపుతారు. అధికారిక వివాహ లైసెన్స్ దంపతులకు తిరిగి పంపిస్తారు.

ఇటీవల న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో జంటలను వైద్య బీమా భద్రతాతో ఉండటానికి వీలుగా ఆన్‌లైన్‌లో వివాహాలు నిర్వహించడానికి అనుమతించడం గురించి మాట్లాడుతూ ఇది మంచి ఆలోచన అని ఆయన అన్నారు, అయితే నగరవాసులు ఎన్‌వైసి కేర్ ప్రోగ్రామ్‌తో సహా ఇతర మార్గాల ద్వారా ఆరోగ్య బీమాను పొందవచ్చని సూచించారు.