Asianet News TeluguAsianet News Telugu

మీరు ఒంటరి కాదు, కరోనా చీకట్లను తరిమేద్దాం: ప్రధాని సందేశం

ఈ ప్రస్తుత లాక్ డౌన్ అవసరం. అందరం ఇండ్లలోనే ఉండాలి. అలా అని ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. 130 కోట్ల సామూహిక శక్తి ఇది అని అందరికి అర్థమయ్యేలా చేసేందుకు ప్రజలందరి దగ్గరినుండి ఆదివారం రోజున 9 నిమిషాలు కోరారు. 

"Light Candles On Sunday At 9 pm To Show Solidarity Amid Lockdown": PM Narendra Modi
Author
New Delhi, First Published Apr 3, 2020, 9:37 AM IST

భారతదేశంలో లాక్ డౌన్ 9 రోజులుగా కొనసాగుతున్న సందర్భంగా ప్రధాని మోడీ భారత ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇన్ని రోజులుగా భారతీయులు ఈ కరోనా పై పోరులో చూపెడుతున్న నియమ నిష్టలు, అందిస్తున్న సహాయ సహకారాలు అద్భుతం, అద్వితీయం అని ప్రధాని మోడీ కొనియాడారు.  

మార్చ్ 22 ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు దేశంకోసం ఇంతలా పరితపిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నవారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలను అభినందించారు మోడీ. 

ఇప్పటివరకు మన దేశంలో కరోనా పై పోరులో తీసుకుంటున్న నిర్ణయాలు, మన కార్యక్రమాలు ప్రాపంచానికి ఆదర్శనీయమయ్యాయని అయన తెలిపారు. జనతా కర్ఫ్యూ కానీయండి, చప్పట్లు కొట్టడం కనివీబీవండి అన్ని కార్యక్రమాల్లోనూ ప్రపంచ దేశాలు మనల్ని చూసి స్ఫూర్తి పొందుతున్నాయని ప్రధాని అన్నారు. 

ప్రపంచం ఇలాంటి విపత్కరమైన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు భారతీయులంతా సామూహిక శక్తి గొప్పతనాన్ని, ప్రజలంతా సామూహికంగా కలిసికట్టుగా కొనసాగితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పరానిన్ ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ కరోనా పై యుద్ధంలో అంధర్మ చరితార్థులం అయ్యే రోజులు ముందు కనబడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇండ్లలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఒంటరి వారు కారని, వారందరితో 130 కోట్ల మంది భారతీయులు తోడు ఉన్నారని అన్నారు. 

ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా కూర్చొని తామొక్కరమే ఈ యుద్ధాన్ని ఎలా గెలుస్తామని, తామొక్కరం యుద్ధం చేస్తే సరిపోతుందా అని ఆలోచిస్తున్నారని, కానీ ఈ యుద్ధాన్ని ఒక్కరే కాకుండా దేశంలోని 130 కోట్ల మందితో కలిసి చేస్తున్నారని మోడీ తెలిపారు. 

ఈ ప్రస్తుత లాక్ డౌన్ అవసరం. అందరం ఇండ్లలోనే ఉండాలి. అలా అని ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. 130 కోట్ల సామూహిక శక్తి ఇది అని అందరికి అర్థమయ్యేలా చేసేందుకు ప్రజలందరి దగ్గరినుండి ఆదివారం రోజున 9 నిమిషాలు కోరారు. 

కరోనా అంధకారాన్ని జయించాలంటే... ప్రకాశవంతమైన జ్వాలలు అవసరమని, ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇంట్లోని లైట్లు అన్ని కూడా ఆఫ్ చేసి బాల్కనీలల్లకు, దర్వాజల వద్దకు వచ్చి తమకు అందుబాటులోని వెలుగులను ప్రసరించాలని కోరారు. 

కొవ్వొత్తి కానీ, దీపం కానీ, ఆఖరకు మొబైల్ ఫ్లాష్ లైట్ కానీ ఏదో ఒకదాన్ని నలువైపులా ప్రసరింపజేస్తే... కరోనా అంధకారం పై మనం గెలుస్తామన్న శక్తి వస్తుందని, ఈ యుద్ధంపై భారత జాతి అంతా కూడా ఐకమత్యంతో ఉందనే సందేశం వెళుతుందని, ఇండ్లలో ఉన్నవారు ఈ పోరులో ఒంటరులు కారు అని చాటి చెప్పాలని మోడీ పిల్లుపునిచ్చారు.  

ఇలా భారతీయులంతా వెలుగులు ప్రసరిస్తే... దేశంలో ఈ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేద, వర్గానికి చెందినవారంతా కూడా ఈ కరోనా పై యుద్ధంలో తవరలోనే విజయం సాధిస్తామనే నమ్మకం కలుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. 

ఉత్సాహాన్ని మించిన శక్తి లేదని, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేస్తే... మనల్ని ఆప్ శక్తి ఎవ్వరికి లేదని, ఈ కరోనా మహమ్మారి పై విజయం సిద్ధిస్తుందని, ఆ దిశగా మార్గం సుగమం అవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమంలో ఎవ్వరు కూడా ఇండ్లు ధాటి బయటకు రావొద్దని, సోషల్ డిస్టెంసింగ్ అనే లక్ష్మణ రేఖను దాటవద్దని మోడీ మరోమారు ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios