దేశవ్యాప్తంగా వివిధ సెలవుల కారణంగా భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు అక్టోబర్ 2020 నెలలో 14 రోజులు సెలవు లభించనుంది. వీటిలో ప్రతి నెల రెండవ, నాలుగోవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకం ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే ఇతర మతపరమైన పండుగల బట్టి అవి మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో ఆ రాష్ట్ర బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆర్‌బిఐ వెబ్‌సైట్ ప్రకారం అక్టోబర్ 2020లో బ్యాంక్ సెలవుదినాల్లో మొదట  అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, మహాశాప్తమి, దసరా, ఈద్-ఎ-మిలాద్ వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. బ్యాంక్ సెలవుల కారణంగా ఎటిఎంలలో నగదు పంపిణీ  కూడా చేయకపోవచ్చు.

also read కరోనా కారణంగా డిస్నీ సంచలన నిర్ణయం.. అందుకే కొన్ని కార్యక్రమాలను కూడా నిలిపివేశాం.. ...


అక్టోబర్ 2020 బ్యాంక్ సెలవుల జాబితా

అక్టోబర్ 2 శుక్రవారం - మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 4 ఆదివారం - పబ్లిక్ హాలిడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 8 గురువారం - చెల్లం ప్రాంతీయ సెలవు (ప్రాంతీయ)

అక్టోబర్ 10 శనివారం-రెండవ శనివారం (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 11 ఆదివారం - పబ్లిక్ హాలిడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 17 శనివారం - కాటి బిహు (అస్సాం)

అక్టోబర్ 18 ఆదివారం- పబ్లిక్ హాలిడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 23 శుక్రవారం - మహాశాప్తమి ప్రాంతీయ సెలవుదినం (కొన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 24 శనివారం - మహాషప్తమి ప్రాంతీయ సెలవుదినం (కొన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 25 ఆదివారం - పబ్లిక్ హాలిడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 26 సోమవారం - విజయ దశమి (కొన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 29 గురువారం- మిలాడ్-ఎ-షరీఫ్, ప్రాంతీయ సెలవు (ప్రాంతీయ)

అక్టోబర్ 30 శుక్రవారం - ఈద్-ఎ-మిలాడ్ (కొన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 31 శనివారం - మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి, ప్రాంతీయ సెలవు (ప్రాంతీయ)