ముకేశ్- నీతా అంబానీల గారాల పట్టి, పిరమాల్ కుటుంబ కోడలు ఈశా అంబానీ పిరమాల్ తన తండ్రే తనకు ఆదర్శమని పేర్కొంటున్నారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతూ ఆయన కలలు సాకారం చేయడమే లక్ష్యమన్నారు. తన జీవితాన్ని తాను ప్రేమిస్తానని, తన తల్లిదండ్రుల జీవితంలో మరో కోణం ఉన్నదన్న సంగతి తెలియదన్నారు. తాను షేక్స్ పియర్ సూక్తులకు ప్రాధాన్యం ఇస్తే ఆనంద్ పిరమాల్ భగవద్గీత సూక్తులు గుర్తు చేస్తుంటారని ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.