Asianet News TeluguAsianet News Telugu

‘సై’ అంటే ‘సై’: ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ మధ్య టఫ్ ఫైట్

భారతదేశ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు పొందడంలో జొమాటో, స్విగ్గీ మూడొంతుల వాటాను ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా గల స్మార్ట్ ఫోన్లలో 12 శాతం మాత్రమే జొమోటా యాప్స్ ఇన్ స్టాల్ చేయబడింది.

Zomato, Swiggy Swiftly Gaining Traction In India Tier 2 Cities
Author
New Delhi, First Published Jul 21, 2019, 10:57 AM IST

ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని ఫుడ్ సరఫరా చేస్తున్న సంస్థలు జొమాటో, స్విగ్గీ నువ్వా? నేనా? అన్నట్లు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ రంగంలో మూడొంతుల డిమాండ్‌ను ఈ రెండు సంస్థలే నెరవేరుస్తున్నాయి. మొత్తం దేశంలోని స్మార్ట్‌ఫోన్లలో 12 శాతం ఫోన్లు జొమాటో యాప్‌ను కలిగి ఉండగా, 10 శాతం ఫోన్లు స్విగ్గీ యాప్‌ను కలిగి ఉన్నాయి. 

మిగతా పోటీ సంస్థలు దరిదాపుల్లో కూడా లేవు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట్‌ లాంటి ‘టూటైర్‌’ నగరాలు, పట్టణాల్లో ఈ రెండు సంస్థలు పోటాపోటీగా దూసుకుపోతుండడం విశేషమని మార్కెట్‌ అధ్యయన సంస్థ ‘ఉనోమర్‌’ పేర్కొంది. 

గత మే నెల నాటికి దేశంలో మొత్తం 60 లక్షల స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు ‘ఉనోమర్‌’ అంచనా వేసింది. ‘జొమాటో ప్రారంభించిన గోల్డ్‌ ప్రోగ్రామ్‌’ బాగా పనిచేసిందని, అది కస్టమర్లల్లో విశ్వాసాన్ని బాగా పెంచిందని, పర్యవసానంగా పదే పదే ఆర్డర్లు జొమాటోకు వచ్చి పడ్డాయని ఉనోమర్‌ సంస్థ డైరెక్టర్‌ రిచా సూద్‌ తెలిపారు.

దేశంలో దాదాపు 1200 రెస్టారెంట్లు, బార్లు, పబ్‌ల నుంచి సరఫరా చేసే ఏటా రూ. 1000 విలువైన ఫుడ్‌పై గోల్డ్‌ ప్రోగామ్‌ కింద సబ్‌స్క్రిప్షన్‌ రాయితీ కల్పించడం జొమాటోకు బాగా కలిసివచ్చింది. 

ఇటీవల దాన్ని ఆహార పరిణామాన్ని బట్టి పరిమితం చేయడం పట్ల వినియోగదారుల్లో కొంత అసంతప్తి వ్యక్తమైనా దాని వల్ల వ్యాపారం పెద్దగా దెబ్బతినలేదని రిచా సూద్‌ వివరించారు. క్రికెట్‌ వరల్డ్‌ కప్, ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా మంచి డిస్కౌంట్లు ఇవ్వడంతోనూ కూడా జొమాటో, స్విగ్గీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.

స్మార్ట్‌ఫోన్లపై ఆధారపడి సరఫరా చేసే ఆహారం గతేడాదిలో ఏడు శాతం వృద్ధి చెందింది. వాస్తవంగా ఇది పెద్ద వృద్ధిరేటు కాదు. మొత్తం ఆహార పరిశ్రమలో దీని వాటా 17 శాతం మాత్రమే. ఇది మున్ముందు మొత్తం 79 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. 

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ కమ్ డెలివరీ కేటగిరీలో ఎంతో అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఆహారాన్ని సరఫరా చేసే యాప్‌లను వినియోగదారులు ఎక్కువగా కలిగి ఉన్నారు. 

కానీ వాటికన్నా తక్కువ వినియోగదారులను కలిగి ఉన్న హైదరాబాద్, జైపూర్‌ లాంటి టూ టైర్‌ నగరాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా నడుస్తోంది. ఢిల్లీ, కోల్‌కతా, చండీగఢ్‌ నగరాల్లో జొమాటో ముందుండగా, చెన్నై, గువహాటి, కోచి నగరాల్లో స్విగ్గీ దూసుకుపోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios