Asianet News TeluguAsianet News Telugu

చీటింగ్ కేసు.. కటకటాల్లో లక్ష్మీ మిట్టల్‌ బ్రదర్ ప్రమోద్

  • స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌ను మోసం కేసులో బోస్నియా పోలీసులు అరెస్ట్ చేశారు.
  • నేరం రుజువైతే మాత్రం ప్రమోద్ మిట్టల్, ఆయన సహ నిందితులకు బోస్నియా చట్టాల ప్రకారం 45 ఏళ్ల జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు.
Indian industrialist Pramod Mittal held in Bosnia
Author
New Delhi, First Published Jul 24, 2019, 12:54 PM IST

న్యూఢిల్లీ: భారతదేశ వ్యాపారవేత్త, స్టీల్‌ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్‌ మిట్టల్‌ను బోస్నియా పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్‌ చేశారు.  మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. 

ఈశాన్య పట్టణం లుకావాక్‌లో ఒక కోకింగ్ ప్లాంట్‌ కేసులో ప్రమోద్‌ మిట్టల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే  ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు బోస్నియా అధికారులు చెప్పారు. 

ప్రమోద్‌ మిట్టల్‌తోపాటు ఆయన కంపెనీ జనరల్ మేనేజర్ పరమేశ్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తుజ్లా కంటోనల్ ప్రాసిక్యూషన్ విభాగం ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ మీడియాకు తెలిపారు. 
నిందితులను కోర్టుముందు హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో దోషులుగా తేలితే 45 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నాలుగవ నిందితుడిపై అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశామన్నారు. ఈ పరిణామంపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. 

కాగా బోస్నియాలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి, మెటలర్జికల్ కోక్ ప్రొడ్యూసర్ గ్లోబల్ ఇస్పాత్‌  కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) నేతృత్వంలోని 2003 నుంచి ప్రమోద్‌మిట్టల్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.    

Follow Us:
Download App:
  • android
  • ios