Asianet News TeluguAsianet News Telugu

ఆమ్రపాలి కుంభకోణం... ధోనీపై చర్యలకు డిమాండ్

ధోనీ ప్రచారానికి ప్రభావితమై చాలా మంది ఆమ్రపాలి ప్రాజెక్టులో గృహాలు కొనుగోలు చేశారని సీఏఐటీ ఆరోపిస్తోంది. ఈ గ్రూపు తప్పు చేసినట్లు కోర్టులో రుజువైనందున ఈ గ్రూపుకి ప్రచారం చేసిన ధోనీని సైతం జవాబుదారీ చేయాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

CAIT demands action against M S Dhoni for endorsing realtor Amrapali
Author
Hyderabad, First Published Jul 26, 2019, 10:59 AM IST


టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆమ్రపాలి గ్రూపునకు గతంలో ప్రచారకర్తగా వ్యవహరించిన ధోనీపైనా చర్యలు చేపట్టాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈమేరకు  కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కి లేఖ రాసింది.

ధోనీ ప్రచారానికి ప్రభావితమై చాలా మంది ఆమ్రపాలి ప్రాజెక్టులో గృహాలు కొనుగోలు చేశారని సీఏఐటీ ఆరోపిస్తోంది. ఈ గ్రూపు తప్పు చేసినట్లు కోర్టులో రుజువైనందున ఈ గ్రూపుకి ప్రచారం చేసిన ధోనీని సైతం జవాబుదారీ చేయాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. వేలాది మంది గృహ కొనుగోలు దారులను పుట్టి ముంచిన ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ రెరా రిజిస్ట్రేషన్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios